దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు మధుమేహం బారిన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే మధుమేహంతో బాధ పడేవాళ్లు సాధారణ రైస్ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే సంగతి తెలిసిందే. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లకు ఏ రైస్ తింటే మంచిదనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. తెల్లబియ్యం, బ్రౌన్ రైస్‌తో పోలిస్తే బాస్మతి రైస్ తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలోని పిండిపదార్థాలు ఎంత త్వరగా రక్తంలో కలుస్తాయో గ్లైసెమిక్ ఇండెక్స్ ద్వారా తెలుస్తుంది.
గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకుంటే రక్తంలో త్వరగా గ్లూకోజ్ చేరుతుంది. బాస్మతి రైస్ తింటే రక్తంలో గ్లూకోజు పరిమాణాన్ని నియంత్రణలో ఉంటుందని చెప్పవచ్చు. ఎటువంటి బియ్యం అయినా ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరుగుతోంది. ఆకుకూరలు, ప్రొటీన్, కూరగాయలు ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
గోధుమలు, ధాన్యాలను మితంగా తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. తరచూ షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకుంటూ ఉండటంతో పాటు షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యుల సలహాలు, సూచనలను పాటించాలి. డయాబెటిస్ కిడ్నీ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతోంది. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి.
షుగర్ లెవెల్స్ పెంచే ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. పోషకాలు పుష్కలంగా ఉన్న బ్లాక్ రైస్ ను తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రైస్ ను ఫర్‌బిడన్ రైస్ అని కూడా పిలుస్తారు. పీచుపదార్థాలు, పలు పోషకాలు పుష్కలంగా ఉండే బ్లాక్ రైస్ ను తీసుకుంటే మంచిది.