https://oktelugu.com/

ప్రజలకు ఫ్రీగా వాషింగ్ మెషీన్, కేబుల్ టీవీ.. ఎక్కడంటే..?

తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఆన్నా డీఎంకే పార్టీ మేనిఫెస్టోలో ఏకంగా 164 హామీలను పొందుపరచడం గమనార్హం. సీఎం పళనిస్వామి నేడు మేనిఫెస్టోను విడుదల చేయగా మేనిఫెస్టోలోని హామీలు ప్రజలు ఆశ్చర్యపోయేలా ఉండటం గమనార్హం. అన్నా డీఎంకే పార్టీ మేనిఫెస్టోలో ఉచితాలకు పెద్దపీట వేసింది. అన్నాడీఎంకే తమ మేనిఫెస్టోలో ఫ్రీ కేబుల్ టీవీ, ఫ్రీ వాషింగ్ మెషీన్, ఫ్రీ సోలార్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 14, 2021 / 08:42 PM IST
    Follow us on

    తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఆన్నా డీఎంకే పార్టీ మేనిఫెస్టోలో ఏకంగా 164 హామీలను పొందుపరచడం గమనార్హం. సీఎం పళనిస్వామి నేడు మేనిఫెస్టోను విడుదల చేయగా మేనిఫెస్టోలోని హామీలు ప్రజలు ఆశ్చర్యపోయేలా ఉండటం గమనార్హం. అన్నా డీఎంకే పార్టీ మేనిఫెస్టోలో ఉచితాలకు పెద్దపీట వేసింది.

    అన్నాడీఎంకే తమ మేనిఫెస్టోలో ఫ్రీ కేబుల్ టీవీ, ఫ్రీ వాషింగ్ మెషీన్, ఫ్రీ సోలార్ స్టవ్ లు లాంటి హామీలను ఇవ్వడం గమనార్హం. ఇంటికి రేషన్ సరుకులను అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామని, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నాడీఎంకే హామీలు ఇవ్వడం గమనార్హం. అయితే అన్నాడీఎంకే ఇచ్చిన హామీలలో కొన్ని హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

    అమ్మ హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్లు కట్టిస్తామని.. ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని.. సంక్రాంతి పండుగ సమయంలో 2,500 రూపాయలు నగదు పంపిణీ చేస్తామని అన్నాడీఎంకే పేర్కొంది. అన్నాడీఎంకే పార్టీ సిటీబస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ కల్పిస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. ఉపాధి హామీ పనిదినాలకు 150 రోజులకు పెంచుతామని డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గిస్తామని అన్నాడీఎంకే హామీ ఇవ్వడం గమనార్హం.

    ఉచితంగా 2జీబీ డేటాతో పాటు ఆటోరిక్షాలను కొనాలని అనుకునే వారికి 25 వేల రూపాయల సబ్సిడీ ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాల తగ్గింపు, శ్రీలంక తమిళ శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వంతో పాటు విద్యారుణాల రద్దు హామీ కూడా ఇవ్వడం గమనార్హం.