ఆ ప్రాంతంలో మరోసారి లాక్ డౌన్.. మార్చి 31 వరకు పాఠశాలలు మూసివేత..!

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి లాక్‌డౌన్ ను ప్రకటించింది. పూణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు మార్చి 31వ తేదీ వరకు పూణేలోని పాఠశాలలు, […]

Written By: Navya, Updated On : March 14, 2021 8:17 pm
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి లాక్‌డౌన్ ను ప్రకటించింది.

పూణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు మార్చి 31వ తేదీ వరకు పూణేలోని పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు ప్రకటన చేశారు. పూణేలో రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని చెప్పారు. అత్యవసరం అయితే మాత్రమే ప్రజలు బయటికి రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. 50 శాతం మేర సీటింగ్ సామర్ధ్యంతో హోటళ్లు, రెస్టారెంట్లను నడిపించాలని అధికారులు ఆదేశించారు.

రాజకీయ కార్యక్రమాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియలకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రజలు నిబంధనలు పాటించకపోవడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య పెంచాలని వారికి చెబుదామని ఆయన అన్నారు.

మరోవైపు ముంబై నగరంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ పెద్ద భవనాల్లో నివశించే ‌ వారితో పాటు మురికివాడల్లో నివశించే వారికి కరోనా వైరస్ సోకిందని వెల్లడించింది.