Heart Health: గుండెను కాపాడుకోవాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

Heart Health: ఇటీవల కాలంలో గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతోంది. చిన్న వయసులోనే గుండె సమస్యలు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవడంలో ఎన్నో మార్గాలు అనుసరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారాలే మనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. అందరు బేకరీ ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారు. ఉప్పు, నూనె, కారం, మైదా పిండి వాడి చేసే పదార్థాలు మనకు ఎన్నో విధాలుగా చేటు తెస్తాయి. అయినా మనం పట్టించుకోవడం లేదు. వాటినే ఆశ్రయిస్తున్నాం. […]

Written By: Srinivas, Updated On : April 4, 2023 5:04 pm
Follow us on

Heart Health

Heart Health: ఇటీవల కాలంలో గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతోంది. చిన్న వయసులోనే గుండె సమస్యలు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవడంలో ఎన్నో మార్గాలు అనుసరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారాలే మనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. అందరు బేకరీ ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారు. ఉప్పు, నూనె, కారం, మైదా పిండి వాడి చేసే పదార్థాలు మనకు ఎన్నో విధాలుగా చేటు తెస్తాయి. అయినా మనం పట్టించుకోవడం లేదు. వాటినే ఆశ్రయిస్తున్నాం.

కొవ్వు, రక్తపోటు పెరిగిపోవడంతో గుండె జబ్బుల ముప్పు ఎక్కువవుతోంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు అనారోగ్యం కలుగుతుంది. గుండెకు ప్రమాదకరమని తెలిసినా వాటిని మనం విడిచిపెట్టడం లేదు. ఫలితంగా గుండె పనితీరుపై ప్రభావం పడుతోంది. ఎక్కువ ప్రొటీన్లు ఉన్న ఆహారాలు తీసుకుంటే కిడ్నీలకు ప్రమాకరం. దీని వల్ల కూడా గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో గుండె జబ్బుల నుంచి రక్షించుకోవడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి.

కొబ్బరినూనె గుండెకు మంచిదని అనుకుంటారు. కానీ ఇది కొవ్వుతో కూడుకుని ఉంటుంది. ధమనుల్లో అడ్డంకులు కలిగిస్తుంది. తద్వారా గుండె జబ్బుకు కారణమవుతుంది. కూల్ డ్రింక్స్, కృత్రిమ రుచులు, చక్కెర, కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. రక్తపోటు పెరిగేలా చేస్తే హృదయ సంబంధ సమస్యలు వెంటాడుతాయి. అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. స్థూలకాయం షుగర్ రావడానికి కారణమవుతుంది. డయాబెటిస్ కు దారి తీస్తుంది.

Heart Health

అల్కహాల్ అలవాటు ఉంటే ప్రమాకరం. దీన్ని మానుకునే ప్రయత్నం చేయాలి. ఇలా గుండె జబ్బులు రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలు అమలు చేయాలి. ఏది పడితే అది తింటూ శరీరాన్ని ఇబ్బందులకు గురి చేయవద్దు. మనకు పడే ఆహారాలనే మితంగా తీసుకుని గుండెపోటు నుంచి దూరం కావాలి. లేదంటే చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడితే జీవితం అంతే. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం మన పద్ధతులు మార్చుకుని ఆహార శైలిని కంట్రోల్ లో ఉంచుకుంటే మంచిది.