Cupping therapy : కప్పింగ్ థెరపీతో బోలెడన్నీ ప్రయోజనాలు.. ఇంతకీ ఈ థెరపీ అంటే ఏంటి?

కప్పింగ్ థెరపీ పురాతన కాలానికి చెందిన చికిత్స. ఈ కప్పింగ్ థెరపీలో వ్యక్తుల చర్మంపై ప్రత్యేక కప్పులను కొన్ని నిమిషాల పాటు ఉంచుతారు. దీంతో కప్ కింద ఉన్న చర్మం ఉబ్బుతుంది. దీంతో ఆ ప్లేస్‌లో రక్తప్రసరణ పెరుగుతుంది. కప్పుల కింద చర్మం దగ్గర రక్త ప్రసరణ మెరుగుపడటంతో మలినాలు, విషపదార్థాలను తొలగిస్తుంది.

Written By: Kusuma Aggunna, Updated On : August 25, 2024 3:38 pm

Cupping therapy

Follow us on

Cupping therapy : మనదేశంలో పురాతన థెరపీలు చాలానే ఉన్నాయి. కానీ మనకి చాలా థెరపీలు తెలియవు. ఎక్కువగా అనారోగ్య సమస్యలకు ఈ పురాతన థెరపీలు వాడుతుంటారు. ప్రస్తుతమున్న జీవనశైలి, అనారోగ్య సమస్యల వల్ల చాలామంది పురాతన థెరపీలను వాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉండాలని ఇలాంటి పద్ధతులను పాటిస్తున్నారు. అయితే ఈ మధ్య ఎక్కువగా కప్పింగ్ థెరపీ పాపులర్ అయ్యింది. దీనిని ఎక్కువగా సెలబ్రిటీలు వాడుతున్నారు. మరి ఈ కప్పింగ్ థెరపీ అంటే ఏమిటి? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

కప్పింగ్ థెరపీ పురాతన కాలానికి చెందిన చికిత్స. ఈ కప్పింగ్ థెరపీలో వ్యక్తుల చర్మంపై ప్రత్యేక కప్పులను కొన్ని నిమిషాల పాటు ఉంచుతారు. దీంతో కప్ కింద ఉన్న చర్మం ఉబ్బుతుంది. దీంతో ఆ ప్లేస్‌లో రక్తప్రసరణ పెరుగుతుంది. కప్పుల కింద చర్మం దగ్గర రక్త ప్రసరణ మెరుగుపడటంతో మలినాలు, విషపదార్థాలను తొలగిస్తుంది. అలాగే ఎలాంటి నొప్పులు, వాపులు ఉన్న విముక్తి కలుగుతుంది. చాలామంది ఈ చికిత్సను విశ్రాంతి కోసం తీసుకుంటారు. కప్పుల ద్వారా శరీరం మసాజ్ పొందుతుంది. దీంతో విశ్రాంతి దొరుకుతుందని భావిస్తారు. అలాగే కప్పింగ్ థెరపీ వల్ల రక్తహీనత, హిమోఫిలియా వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మ సంబంధిత సమస్యలు, రుగ్మతలు రావు. ఆర్థరైటిస్, తామర, చర్మంపై మొటిమలు, అలెర్జీ వంటివి ఉన్నా వెంటనే విముక్తి కలుగుతుంది.

కొంతమందికి బాడీ పెయిన్స్ ఉంటాయి. కప్పింగ్ థెరపీ వీటి నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. అలాగే వెన్నునొప్పి, మైగ్రేన్, అధిక రక్తపోటు, ఆందోళన, నిరాశ, అనారోగ్య సిరలు వంటి సమస్యలకు కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ కప్పింగ్ థెరపీ వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. బాడీలో ఒక్కో చోట కప్పింగ్ పెడతారు. దీంతో రక్తం సరఫరా కావడంతో తొందరగా బరువు తగ్గుతారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యు నిపుణులు అంటున్నారు. కప్పింగ్ జరిగిన రోజూ కాస్త అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. అయితే బరువు తగ్గడానికి దాదాపు 7 సెషన్లు తీసుకుంటే మీకు ఫలితం కనిపిస్తుంది. ఈ థెరపీ తీసుకున్న తర్వాత జీవనశైలిలో కూడా అలవాట్లు మార్చాలి. అప్పుడే రిజల్ట్ ఉంటుంది.

ఈ కప్పింగ్ థెరపీని దాదాపు 1000 ఏళ్ల క్రితం నుంచి ఉందట. ఎక్కువగా ఈజిప్టు, చైనాలో ఈ చికిత్స తీసుకునేవాళ్లు. ఆ తర్వాత ఈ చికిత్స తీసుకోవడం తగ్గించేశారు. అప్పుడు చికిత్స సమయంలో డ్రింక్ తీసుకునే కప్పులు, జంతువుల కొమ్ములు వాడేవారు. అయితే ఈ చికిత్సలో గాజు, వెదురు, మట్టి, సిలికాన్ లేదా ప్లాస్టిక్ కప్పులను కూడా ఉపయోగిస్తారట. ఈ థెరపీ పూర్తిగా సురక్షితమని, దీనివల్ల చర్మ రంగు కూడా మారుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.