Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ వల్ల చాలామంది తక్కువగా నిద్రపోతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా నిద్ర లేస్తున్నారు. పగలు ఎంత పడుకున్న.. రాత్రి నిద్ర చాలా ముఖ్యమైనది. ఒక్కరోజు నిద్ర లేకపోతే దాన్ని కవర్ చేసుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల నిద్ర అవసరం అవుతుంది. నిద్ర లేకపోతే రోజంతా కాస్త చిరాకుగా ఉంటుంది. ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేరు. బాడీకి సరైనా నిద్ర అందకపోతే.. గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్, ఉబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిద్ర తక్కువ అయితే కొంతమందికి మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శరీరానికి సరిపడ నిద్ర అనేది తప్పనిసరి. ఆరోగ్యానికి నిద్ర కావాలని చాలా మంది చాలా మంది ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఉదయం పూట ఆలస్యంగా నిద్ర లేస్తారు. దీనివల్ల వారు కొన్ని సమస్యల బారిన పడతారట. ఇంతకీ అవేంటో మరి చూద్దాం.
ఎక్కువగా కోపానికి గురవుతారు
ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల రోజంతా చిరాకుగా ఉంటుంది. వీరు ఎక్కువగా ప్రతీ చిన్న విషయానికి కోపానికి గురవుతారు. ఎవరు ఏం చెప్పిన కూడా పెద్దగా పట్టించుకోరు. సాధారణంగా చెప్పిన కూడా ప్రతీ ఇతరుల మీద చిరాకుగా ఉంటారు. రోజంతా యాక్టివ్‌గా ఉండకుండా నీరసంగా ఉంటారు. నిద్ర లేకపోతే ఏ పని కూడా చేయబుద్ధి వేయదు. ఖాళీగా టైమ్‌పాస్ చేస్తుంటారు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయి లేవడం వల్ల ఆలోచన కూడా సరిగ్గా చేయలేరు.
ఆకలి తగ్గిపోవడం
ఉదయం సమయంలో ఆలస్యంగా లేవడం వల్ల పూర్తిగా ఆకలి కూడా ఉండదు. మీరు వేకువ జామున లేస్తే.. వెంటనే ఆకలి వేస్తుంది. అదే మధ్యాహ్నం ఒకటికి అలా లేస్తే అసలు ఆ రోజు మొత్తం కూడా తినాలనిపించదు. దీనివల్ల అనారోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి రోజూ తొందరగా నిద్రపోయి, తొందరగా లేచే అలవాటును పెంచుకోవడం మంచిది. దీనివల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఫుడ్ పూర్తిగా లేకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు వంటివి వస్తాయి.
బద్దకంగా ఉంటారు
ఆలస్యంగా లేవడం వల్ల రోజంతా బద్దకంగా ఉంటుంది. ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ రాదు. చేయాలని ఎంత ట్రై చేసిన కూడా పని చేయాలనే ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండి పనులు చేయాలంటే మాత్రం ఉదయం పూట తొందరగా లేవాలి. అప్పుడే ఎలాంటి పనులు అయిన ఇట్టే చేయగలరు. అయితే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోకూడదు. మనిషికి కనీసం 8 గంటలు నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువగా ఆలోచిస్తుంటారు
ఉదయం తొందరగా లేవడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. అదే ఆలస్యంగా లేస్తే సరిగ్గా ఏం ఆలోచించలేరు. అలాగే ఆలస్యంగా లేచిన తర్వాత తినకపోవడం వల్ల అనవసర ఆలోచనలు పెరుగుతాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే తిండి, నిద్ర అనేది తప్పనిసరి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.