https://oktelugu.com/

Ram Charan: 5 రోజుల్లో రామ్ చరణ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటూ భక్తులు వార్నింగ్..రోజురోజుకి ముదురుతున్న వివాదం!

తమ మనోభావాలను దెబ్బ తీసేలా ప్రవర్తించిన రామ్ చరణ్ 5 రోజుల లోపు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడుతాము అంటూ రామ్ చరణ్ ని హెచ్చరించారు. ఈ వివాదం పై సోషల్ మీడియా లో రచ్చ ఇంకా జరుగుతూనే ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 21, 2024 / 02:50 PM IST

    Ram Charan(9)

    Follow us on

    Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వివాదాల్లో చిక్కుకున్నాడు . ఇటీవలే ఆయన కడప దర్గాలో నిర్వహించిన 80 వ ముషాయిరా గాజా ఉత్సవాల్లో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ దర్గాలోకి ఎలా అడుగుపెడుతాడని ఆయన పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. దర్గాలోపలకు వెళ్లే ముందు విభూది, బొట్టుని ఆయన తొలగించడం పై తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక తప్పుబట్టింది. ఈ సందర్భంగా బుధవారం నాడు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నాయని బుచ్చిరాజు గురుస్వామి, ప్రేమ గాంధీ గురుస్వామి, రాధాకృష్ణ గురుస్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రామ్ చరణ్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ‘హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా, రామ్ చరణ్ బొట్టు, వీబూదిని ధరించి, తలకు తెల్లరంగు రుమాలు చుట్టుకోవడం ఏమిటి?, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము’ అంటూ మండిపడ్డారు.

    తమ మనోభావాలను దెబ్బ తీసేలా ప్రవర్తించిన రామ్ చరణ్ 5 రోజుల లోపు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడుతాము అంటూ రామ్ చరణ్ ని హెచ్చరించారు. ఈ వివాదం పై సోషల్ మీడియా లో రచ్చ ఇంకా జరుగుతూనే ఉంది. దీనిపై రామ్ చరణ్ స్పందిస్తాడో లేదో చూడాలి. ఒకపక్క ఆయన బాబాయ్, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా హిందువుల మనోభావాల గురించి దేశం మొత్తం వినిపించేలా ప్రసంగాలు ఇస్తుంటే, మరోపక్క రామ్ చరణ్ ఇలా చేయడం సరికాదని, దీనికి రామ్ చరణ్ వివరణ ఇవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి రామ్ చరణ్ అభిమానులు కూడా ధీటుగా సమాదానాలు చెప్తున్నారు.

    ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా టీజర్ కి అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. కచ్చితంగా రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి మెగా అభిమానులు గర్వపడే స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటాడని బలమైన విశ్వాసం తో ఉన్నారు . త్వరలోనే ఈ సినిమా నుండి మూడవ పాట విడుదల కానుంది. వచ్చే నెల మొత్తం ఈ సినిమా ప్రొమోషన్స్ ని గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేయడానికి సిద్ధం అవుతున్నారు మేకర్స్. తిరుపతి లో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా విచేయబోతున్నాడని టాక్.