రాత్రి మిగిలిన అన్నం ఉదయం తింటున్నారా.. ప్రమాదమంటున్న వైద్యులు?

ఇంట్లో రాత్రి సమయంలో అన్నం మిగిలితే ఆ అన్నాన్ని ఉదయం తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే మిగిలిన అన్నాన్ని తినే విషయం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. లేకపోతే పాడైన అన్నం తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కొన్నిసార్లు రాత్రి మిగిలిన అన్నం మరుసటి రోజు తినడం వల్ల ఫుడ్ […]

Written By: Navya, Updated On : July 29, 2021 11:41 am
Follow us on

ఇంట్లో రాత్రి సమయంలో అన్నం మిగిలితే ఆ అన్నాన్ని ఉదయం తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే మిగిలిన అన్నాన్ని తినే విషయం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. లేకపోతే పాడైన అన్నం తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

కొన్నిసార్లు రాత్రి మిగిలిన అన్నం మరుసటి రోజు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు సైతం ఉంటాయి. బియ్యం ఉడికిన తరువాత గది ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువ సమయం ఉంచితే అన్నంలోకి బ్యాక్టీరియా చేరి ఆ బ్యాక్టీరియా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అన్నం వండిన ఒకటి నుంచి రెండు గంటల్లోపు తప్పనిసరిగా తినాలి. అలా చేయడం కుదరకపోతే అన్నాన్ని ఫ్రిజ్ లో ఉంచాలి.

ఫ్రిజ్ లో ఉంచిన అన్నాన్ని కొన్ని గంటల తర్వాత తినవచ్చు అయితే ఒకరోజు తర్వాత మాత్రం తినకూడదు. అన్నం వేడి చేసుకుని తినాలని అనుకుంటే ఒకసారి మాత్రమే అన్నాన్ని వేడి చేయాల్సి ఉంటుంది. పదేపదే అన్నాన్ని వేడి చేయడం వల్ల నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మళ్లీమళ్లీ వేడి చేసిన అన్నం తిన్నా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

మిగిలిన అన్నం తినడం మీ ఆరోగ్యానికి హానికరం అని చాలా పరిశోధనలలో వెల్లడి కావడం గమనార్హం. పిల్లలకు మిగిలిన అన్నాన్ని అస్సలు తినిపించకూడదు. మిగిలిన అన్నం వల్ల పెద్దలతో పోలిస్తే పిల్లలకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.