https://oktelugu.com/

ఆ ట్రెండ్ ను ఫాలో అవుతున్న తెలుగు హీరోస్

తెలుగు సినీ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇన్నాళ్లు కరోనా భయంతో కకావికలం అయిన పరిశ్రమలో కొత్త సినిమాల నిర్మాణం వేగం పుంజుకుంది. స్టార్ హీరోలతోపాటు కుర్ర హీరోలు సైతం తమ పంథా మార్చుకున్నారు. ఒక్కో కథానాయకుడు నాలుగు సినిమాలతో బిజీ అయిపోయారు. దీంతో ప్రేక్షకులకు ఇక కనువిందు కానుంది. చిత్రాల నిర్మాణంలో నిర్మాతలు సైతం తమ వ్యాపార కార్యకాలపాలను విస్తరించుకుంటున్నారు. సంవత్సరానికి ఒక్క సినిమాతో సరిపెట్టుకునే హీరోలు ఇప్పుడు నాలుగు సినిమాలతో దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 28, 2021 / 05:46 PM IST
    Follow us on

    తెలుగు సినీ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇన్నాళ్లు కరోనా భయంతో కకావికలం అయిన పరిశ్రమలో కొత్త సినిమాల నిర్మాణం వేగం పుంజుకుంది. స్టార్ హీరోలతోపాటు కుర్ర హీరోలు సైతం తమ పంథా మార్చుకున్నారు. ఒక్కో కథానాయకుడు నాలుగు సినిమాలతో బిజీ అయిపోయారు. దీంతో ప్రేక్షకులకు ఇక కనువిందు కానుంది. చిత్రాల నిర్మాణంలో నిర్మాతలు సైతం తమ వ్యాపార కార్యకాలపాలను విస్తరించుకుంటున్నారు. సంవత్సరానికి ఒక్క సినిమాతో సరిపెట్టుకునే హీరోలు ఇప్పుడు నాలుగు సినిమాలతో దూసుకుపోతున్నారు.

    మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజులుగా సినిమాల్లో వేగం పెంచారు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య సినిమా పూర్తి కాక ముందే మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబీ లాంటి దర్శకులతో వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మెగాస్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా కొరటాల కాంబినేషన్లో నిర్మిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ఇప్పుడు కోకాపేట్ లో జరుగుతోంది.

    రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంవత్సరానికి రెండు సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ తో కుదేలైన సినిమా పరిశ్రమను గాడిలో పెట్టేందుకు పవన్ కూడా తన చేయి వేస్తున్నారు. అభిమానుల కోసం ఏడాదికి రెండు సినిమాలతో బిజీ అయిపోయారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రానాతో కలిసి అయ్యప్పమమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్నారు. క్రిష్ తో హరిహరవీరమల్లు, ఇవే కాకుండా హరీశ్ శంకర్, త్రివిక్రమ్ తో సినిమాలు చేయడానికి అంగీకరించారు.

    హీరో బాలకృష్ణ కూడా సినిమాల నిర్మాణంతో బిజీగా ఉన్నారు. అఖండ తో దూసుకుపోతున్న బాలయ్య మలినేని గోపీచంద్ తో ఓ సినిమా చేస్తున్నారు. వీటితోపాటు అనిల్ రావిపూడితో మరో సినిమా, పూరీతో మరోసారి కలిసేందుకు బాలకృష్ణ రెడీ అయిపోయినట్లు సమాచారం. అక్కినేని నాగచైతన్య కూడా స్పీడ్ పెంచారు. నాలుగు సినిమాలతో సందడి చేస్తున్నారు. విక్రమ్ కుమార్ తో థాంక్యూ, అమీర్ ఖాన్ తో బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా, బంగర్రాజు సీక్వెల్ లో నటిస్తున్నారు.

    తనకంటూ ఓ ట్రెండ్ చేసుకున్న శర్వానంద్ కూడా నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. నాగశౌర్య కూడా నాలుగు సినిమాలకు సంతకాలు చేసినట్లు తెలిసింది. తెలుగు సినిమా హీరోలందరు కరోనా నేపథ్యంలో కాస్త నెమ్మదించినా ప్రస్తుతం వారు పనిలో స్పీడ్ పెంచేశారు. సినిమాల నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. దీంతో ప్రేక్షకులకు కనువిందు కానున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.