
ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఇండ్‌బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 27 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కా గా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పాసై ఎన్‌ఐఎస్‌ఎం డీపీ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు సంబంధిత పనిలో తప్పనిసరిగా అనుభవం ఉండాలి. పరీక్ష లేకుండా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగష్టు 14వ తేదీ చివరి తేదీగా ఉంటుంది. https://corporate.indbankonline.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల గురించి తెలుసుకోవచ్చు.
అభ్యర్థులు వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మొత్తం 27 ఉద్యోగ ఖాళీలలో హెడ్ – డిపీ డిపార్ట్‌మెంట్ 1, హెడ్ – అకౌంట్ ఓపెనింగ్ డిపార్ట్‌మెంట్ 1, డీపీ స్టాఫ్ 3, బ్రాంచ్ హెడ్ – రిటైల్ లోన్ కౌన్సెలర్ 5, ఫీల్డ్ స్టాఫ్ – రిటైల్ లోన్ కౌన్సెలర్ 17 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. హెడ్ – డీపీ డిపార్ట్‌మెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి సంవత్సరానికి 8.50 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.
మిగిలిన ఉద్యోగాలకు లక్షన్నర నుంచి 6 లక్షల రూపాయల వరకు వేతనం లభిస్తుంది. అభ్యర్థులు కంపెనీ చెన్నై అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.