Chanakya Neeti – Become Rich : ఆచార్య చాణక్యుడు మనిషి జీవితంలో ఎలా పైకి ఎదగాలో చెప్పాడు. డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా చేస్తే ధనవంతులం అవుతాం అనే విషయాలపై ఎన్నో మార్గాలు సూచించాడు. జీవితం సరైన మార్గంలో పయనించాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశాడు. ఉన్నపాటుగా ధనవంతులుగా కావాలంటే కొన్ని పనులు చేయాలి. ధనార్జన ధ్యేయం కోసం ఏ నియమాలు పాటించాలో తెలిపాడు.
నిజాయితీ
నీతి, నిజాయితీతో ఉండే వాడికి ఏదైనా సాధ్యమే. ఉన్నత స్థానంలో ఉండేందుకు అతడు చేసే ప్రయత్నాలు మంచివి కావడంతో మనకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. దీంతో మనం జీవితంలో ఎదిగే అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. అనైతికంగా వ్యవహరిస్తే మనకు నష్టాలే వస్తాయి. అక్రమాల ద్వారా సంపాదించే డబ్బు నిలవదు. సక్రమమైన మార్గమే అన్నింటికి మూలాధారం.
నైపుణ్యం
ఆచార్య చాణక్యుడు నైపుణ్యం ద్వారానే వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహిస్తాడు. విద్య, నైపుణ్యాలపై ఫోకస్ పెడితేనే అనుకున్నది సాధిస్తాడు. నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. దీంతో జీవితంలో ఎదిగేందుకు కావాల్సిన అవకాశాలను అందిపుచ్చుకుంటాడు. జీవితంలో మంచి స్థానం దక్కించుకునేందుకు ముందుకు నడుస్తుంటాడు.
పట్టుదల
మనం ఏదైనా పని చేయడానికి పట్టుదల ఉండాలి. పని మొదలు పెట్టామంటే పూర్తయ్యే వరకు పట్టుదల వదలకూడదు. చాణక్యుడి ప్రకారం మనిషిలో పట్టుదల ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. క్రమశిక్షణ ఉంటే విజయం సాధ్యమే అని చాణక్యుడి అభిప్రాయం. దీంతోనే జీవితంలో ఎదిగేందుకు కావాల్సిన పరిస్థితులను అందిపుచ్చుకుంటేనే విజయం సాధ్యమవుతుంది.
సంబంధాలు
మనుషుల మధ్య సంబంధాలు కలిగి ఉంటే మనకు విజయాలు సాధ్యమవుతాయి. అందరితో బాగా మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకుంటే మనం చేసే పనుల్లో మనకు పనికి వచ్చేవి ఉంటాయి. వాటిని ఫాలో అయితే మనకు విజయం సాధించడానికి గల విషయాలు దొరుకుతాయి. మేధావుల సలహాలు, సూచనలు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.
