https://oktelugu.com/

Rainy Season : వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుందా?.. అయితే ఇలా చేయండి

వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాబట్టి వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా జడ వేయకుండా వదలకూడదు. అలాగే ఎక్కువ సార్లు తలస్నానం చేయకూడదు. అప్పుడే జుట్టు రాలే సమస్యను కొంత వరకు తగ్గించవచ్చు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 12, 2024 / 11:35 PM IST

    Rainy Season Hair fall

    Follow us on

    Rainy Season : ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న పెద్ద సమస్య జుట్టు రాలిపోవడం. జుట్టు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కురులు అనేవి రాలిపోతుంటాయి. జుట్టు రాలిపోకుండా ఉండాలని చాలా మంది ఆహార విషయంలో జాగ్రత్త వహిస్తారు. అలాగే జుట్టుకి ఆయిల్స్, షాంపూ వంటివి వాడేటప్పుడు కూడా కేర్ చూపిస్తారు. కానీ ఏ కాలంలో అయిన జుట్టు ఎక్కువగా రాలిపోవడం మాత్రం సహజం. అయితే అన్ని సీజన్ లతో పోలిస్తే.. వర్షా కాలంలో ఎక్కువగా జుట్టు దెబ్బ తింటుంది. వాతావరణం మారడం వల్ల తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో జుట్టు తొందరగా జిడ్డుగా మారుతుంది. సాధారణంగా జుట్టు అనేది రాలుతుంది. కానీ వర్షాకాలంలో దీని కంటే మూడింతలు ఎక్కువగా రాలుతుంది. వర్షాకాలంలోని తేమ వల్ల జుట్టు కుదుళ్లు ఎక్కువ శాతం హైడ్రోజన్ గ్రహిస్తాయి. ఇది జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంది. దీని వల్ల జుట్టు పలచగా మారుతుంది. అలాగే జుట్టులో చుండ్రు కూడా ఎక్కువగా ఏర్పడుతుంది. దీంతో జుట్టు తొందరగా దెబ్బతింటుంది. అందుకే వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాబట్టి వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా జడ వేయకుండా వదలకూడదు. అలాగే ఎక్కువ సార్లు తలస్నానం చేయకూడదు. అప్పుడే జుట్టు రాలే సమస్యను కొంత వరకు తగ్గించవచ్చు.

    జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాలు ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. బాదం, పిస్తా వంటివి తీసుకోవడంతో పాటు.. ఉడికించిన గుడ్లు తీసుకోవాలి. అలాగే పాలు, పెరుగు, పండ్లు వంటివి తీసుకోవాలి. రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ ని ఎక్కువగా వాడకుండా సహజంగా తయారు చేసుకుంటే బెటర్. మెంతులు, మందార ఆకు వంటి వాటితో ప్యాక్ చేసుకుని తలకు అప్లై చేయాలి. ఇలాంటివి చేస్తూ ఉంటే జుట్టు బలంగా తయారవుతుంది. కొత్త కొత్త ఆయిల్స్ వాడకుండా.. ఇంట్లోనే సహజంగా ప్రిపేర్ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి నూనె, ఆముదం, బాదం వంటివి జుట్టు రాలిపోవడం తగ్గించడంతో పాటు తొందరగా పెరిగేలా చేస్తుంది. అయిన ఈరోజుల్లో ఎవరు తలకి ఆయిల్ అప్లై చేస్తున్నారు. కనీసం వారానికి మూడు రోజులు అయిన జుట్టుకి ఆయిల్ అప్లై చేసి మర్దన చేయాలి. లేకపోతే జుట్టు తొందరగా రాలిపోతుంది. జుట్టుకి ఆయిల్ రాయకుండా డైలీ వదిలేస్తే.. కురులు చివర్లు పగుళ్లు వస్తాయి. ఇవి పగుళ్లు రాకుండా ఉండాలంటే.. పెరుగు, నిమ్మకాయ కలిపి జుట్టుకి అప్లై చేయాలి. అప్పుడే జుట్టు పగుళ్లు తగ్గి, బలంగా ఉంటుంది. అలాగే ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండాలి. ఎప్పుడు బాధ పడుతూ, ఆలోచిస్తే.. జుట్టు తొందరగా రాలిపోతుంది. అలాగే హెయిర్ ప్రొడక్ట్స్ కి కూడా దూరంగా ఉండాలి. అయితే ఏ కాలమైన జుట్టు విషయంలో తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. లేకపోతే సమస్య పెద్దది అవుతుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.