https://oktelugu.com/

QR code : అసలు క్యూఆర్ కోడ్ ఎలా వచ్చింది? దీని హిస్టరీ ఏంటో మీకు తెలుసా?

ఇప్పుడు చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఆన్ లైన్ లోనే పేమెంట్ చేస్తున్నారు. అయితే ఈ క్యూఆర్ కోడ్ ను అందరూ బాగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇది ఎలా వచ్చింది? అసలు దీనిని ఎందుకు తీసుకు వచ్చారు? దీని హిస్టరీ ఏంటో మీకు తెలియకపోతే ఒకసారి స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Bhaskar
  • , Updated On : September 13, 2024 / 12:27 AM IST

    QR Code History

    Follow us on

    QR code : ప్రస్తుతం ఎక్కువ శాతం మంది ఏవైనా కొనాలంటే ఎక్కువగా ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. అందులో అధికంగా క్యూఆర్ కోడ్ ని జనాలు ఉపయోగిస్తున్నారు. పెద్ద వస్తువుల నుంచి ఆఖరికి చిన్న చాక్లెట్ కొనాలన్న కూడా క్యూఆర్ కోడ్ వాడుతుంటారు. ఈ మధ్య కాలంలోనే ఇది బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఆన్ లైన్ లోనే పేమెంట్ చేస్తున్నారు. అయితే ఈ క్యూఆర్ కోడ్ ను అందరూ బాగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇది ఎలా వచ్చింది? అసలు దీనిని ఎందుకు తీసుకు వచ్చారు? దీని హిస్టరీ ఏంటో మీకు తెలియకపోతే ఒకసారి స్టోరీ మొత్తం చదివేయండి.

    ఈ క్యూఆర్ కోడ్ ని జపాన్ లోని కంపెనీ 1994లో ఆవిష్కరించింది. జపనీస్ కంపెనీ డెన్సో వేవ్ అనే కంపెనీ ఈ కోడ్ ను తీసుకొచ్చింది. ఈ కంపెనీ వాహనాలు తయారు చేసేది. ఇలా తయారు చేసే వాహనాల భాగాలను ట్రాక్ చేయడానికి వాళ్లు ఒక బార్ కోడ్ వాడేవాళ్లు. ఈ బార్ కోడ్ బాగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ఈ బార్ కోడ్ లో తక్కువ సమాచారం మాత్రమే నిల్వ చేయగలరు. ఒక పరిమితి వరకు మాత్రమే సమాచారం నిల్వ ఉండేది. దీంతో వాళ్లకు బార్ కోడ్ వల్ల ఇబ్బందులు అయ్యాయి. దీనిని ఎలా అయిన మెరుగు పర్చాలని అనుకున్నారు. దీని కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఒకటి కూడా సక్సెస్ కాలేదు. బార్ కోడ్ స్థానంలో ఏం తీసుకు రావాలి, దీనిని ఎలా మెరుగు పర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో డెన్సో వేవ్ కంపెనీలోని ఒక టీమ్ ఎన్నో రకాల కోడ్ లను ప్రయత్నించారు. కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అయితే ఓ రోజు ఆ బృందంలోని మసా హీరో అరాకు జపనీస్ చెస్ అని పిలిచే షోగి అనే గేమ్ ఆడుతున్నాడు. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు అతనికి నలుపు, తెలుపు ఉండే టూ డైమెన్షల్ కోడ్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. అలా వచ్చిందే ఈ క్యూఆర్ కోడ్. క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్. దీనిలో ఎంతటి సమాచారాన్ని అయిన నిల్వ చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కోడ్ ను ఉపయోగించి లావాదేవీలు, సమాచారం తెలుసుకోవడం అన్ని చేసుకోవచ్చు. వ్యాపారాలు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. ఇది నల్లని చిన్న చతురస్రాకార బాక్స్ లతో ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది వీటిని విరివిరిగా ఉపయోగిస్తున్నారు. అసలు ఈ క్యూఆర్ కోడ్ లేనిదే బయట మార్కెట్ లో ఎవరు కొనలేరు. మొత్తం ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి మీరు క్యూఆర్ కోడ్ ని ఎలా ఉపయోగిస్తున్నారో కామెంట్ చేయండి..