Relationship : పెళ్లి అయిన కొన్నేళ్లకు ఒకరి మీద ఒకరికి ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది?

చాలా జంటలు ఈరోజుల్లో అసలు వాళ్ల పార్టనర్ తో హ్యాపీ గా ఉండటం లేదు. సమాజం కోసం అలోచించి ఇష్టం లేకపోయిన కలిసి ఉంటున్నారు. మరికొందరు విడిపోతున్నారు. అసలు పెళ్లి అయిన కొన్ని రోజులకే పార్టనర్ మీద ఇంట్రెస్ట్ పోవడానికి కారణాలు ఏంటో మరి చూద్దాం.

Written By: Neelambaram, Updated On : September 12, 2024 12:51 pm

Relationship

Follow us on

Relationship :  పెళ్లి అనేది చాలా పవిత్రమైన బంధం. కానీ ఈ జనరేషన్ లో పెళ్లికి అసలు విలువ లేకుండా పోతుంది. కొత్తగా పెళ్లి అయిన వాళ్లు లేదా ఏళ్లు గడిచిన జంటలు కూడా విడాకుల బాట పడుతున్నారు. నిజం చెప్పాలంటే పెళ్లి అయిన కొత్తలోనే ఒకరి మీద ఒకరికి ప్రేమ అన్ని ఉంటున్నాయి. ఏళ్లు గడిచే కొద్ది ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. పూర్వ కాలంలో పెళ్లికి ముందు చూడకుండా పెళ్లి చేసుకునేవారు. అసలు పెళ్లికి ముందు మాట్లాడుకోవడం వంటివి అసలు ఉండేవే కాదు. కానీ ప్రస్తుతం అన్ని విషయాలు పెళ్లికి ముందే మాట్లాడుకుంటున్నారు. అయిన సరే పెళ్లి తరువాత గొడవలు, విడిపోవడాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు కూడా విడాకులు ఉండేవి.. కానీ చాలా తక్కువగా ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య బాగా పెరిగింది. చిన్న వయస్సులోనే తెలియక పెళ్లి చేసుకోవడం.. మనస్పర్ధలు ఎక్కువగా రావడంతో వెంటనే విడిపోతున్నారు. పెళ్లి, పిల్లలు అయిన తర్వాత ఒకరి మీద ఒకరికి అసలు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. చాలా జంటలు ఈరోజుల్లో అసలు వాళ్ల పార్టనర్ తో హ్యాపీ గా ఉండటం లేదు. సమాజం కోసం అలోచించి ఇష్టం లేకపోయిన కలిసి ఉంటున్నారు. మరికొందరు విడిపోతున్నారు. అసలు పెళ్లి అయిన కొన్ని రోజులకే పార్టనర్ మీద ఇంట్రెస్ట్ పోవడానికి కారణాలు ఏంటో మరి చూద్దాం.

ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఆశించడం. బంధంలో ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరు ఆశిస్తారు. వాళ్లు అనుకున్న విధంగా పార్టనర్ లేకపోతే వాళ్ల మీద ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ పోతుంది. నేను చెప్పినట్టు వినకపోతే ఇంకా ఎందుకు అనే విధంగా థింక్ చేస్తారు. ఇలా ఇద్దరి మధ్య చిన్న గొడవలు వచ్చి.. చివరికి విడిపోయేవరకు తెస్తుంది. ఎప్పుడు మన ఇష్టాలనే కాకుండా పార్టనర్ ఇష్టాలని కూడా అర్ధం చేసుకుని గౌరవించాలి. అప్పుడే బంధం కలకాలం ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరు కాకపోతే ఇంకొకరు అనే ఉద్దేశంతో పార్టనర్ ను పెద్దగా పట్టించుకోరు. పెళ్లి అయిన కొన్నాళ్లికే ఇలా గొడవలతో విడిపోతున్నారు. కొందరు సమాజం కోసం అలోచించి కలిసి ఉంటారు. ఎన్నేళ్లు అయిన బంధం సంతోషంగా కలకాలం ఉండాలంటే.. పార్టనర్ ను గౌరవించాలి. ఎంత బిజీగా ఉన్నా మన అనుకున్న పర్సన్ కి టైం ఇవ్వాలి. ముఖ్యంగా చిన్న సంతోషాలు, ప్రేమలు ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. ప్రతి దాంట్లో తప్పులు చూడకుండా.. మంచి చూసి పార్టనర్ ను అర్ధం చేసుకోవాలి. మనకి మనమే రైట్ అనుకోకూడదు. పార్టనర్ వైపు నుంచి కూడా కొన్ని విషయాలు ఆలోచించాలి. తప్పు అని నిందించడం కంటే అర్ధం చేసుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది.