Thyroid : ఈ చిన్న చిన్న సమస్యల వల్లనే థైరాయిడ్ వస్తుందని మీకు తెలుసా?

థైరాయిడ్ అంటే చాలా మందికి తెలిసిన సమస్యనే కదా. థైరాయిడ్ గురించి ఇంకా తెలియని వాళ్లు కూడా చాలా మందే ఉన్నారండోయ్. అయితే ఈ సమస్య మాత్రం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం కష్టపడాల్సిందే అంటున్నారు నిపుణులు. అయినా సరే ఇది చివరి వరకు కూడా జాలి చూపించదు. కేవలం చికిత్స తీసుకోవడం ఒకే మార్గం. అయినా సరే కంట్రోల్ లో ఉంచడం సాధ్యం. కానీ పూర్తిగా దూరం అవ్వదు. సో మీరు చేసే కొన్ని రకాల తప్పుల వలనే థైరాయిడ్ వస్తుంది అని గుర్తు పెట్టుకోండి.

Written By: Swathi Chilukuri, Updated On : October 30, 2024 1:18 pm

Did you know that these little problems can cause thyroid problems?

Follow us on

Thyroid : థైరాయిడ్ వచ్చే ముందు కూడా కొన్ని రకాల లక్షణాలు కామన్ గా కనిపిస్తుంటాయి. ముందుగా వాటిని గుర్తిస్తే ఖచ్చితంగా ముందుగానే జాగ్రత్త పడవచ్చు అంటున్నారు నిపుణులు. లేదంటే ఇది దీర్ఘకాలిక వ్యాధిలా మారుతుంది. సో సమస్య మరింత పెరుగుతుంది. థైరాయిడ్  గొంతు వద్ద కనిపించే ఒక సమస్య. ఇది మెటబాలిజం ఉత్పత్తికి తోడ్పడుతుందట. అయితే హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి సరిగా పని చేయకపోతే.. థైరాయిడ్ వస్తుంది. మరి థైరాయిడ్ వచ్చేందుకు ఎలాంటి తప్పులు చేస్తుంటారో తెలుసుకుంటే ముందుగానే జాగ్రత్త పడవచ్చు.

ఒత్తిడి: ప్రస్తుతం మనీ కోసం, మ్యాటర్ కోసం అంటూ చాలా మంది ఒత్తిడికి లోను అవుతున్నారు. అనవసర విషయాలకు కూడా ఒత్తిడి తీసుకోవడం కామన్ గా కనిపిస్తుంటుంది. సింపుల్ గా సాల్వ్ అయ్యే విషయాలను కూడా పెద్దగా చేసుకుంటూ మరీ ఒత్తిడికి గురి అవుతున్నారు కొందరు. కానీ ఫ్రీగా ఉండటం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. లేదంటే  ఒత్తిడికి ఎక్కువగా గురైతే మాత్రం థైరాయిడ్ సమస్య వస్తుంది. ఎక్కువగా స్ట్రెస్‌కి గురయ్యే వారిలో థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెబుతున్నాయి అధ్యయనాలు.

డయాబెటీస్: డయాబెటీస్‌తో బాధ పడేవారికి కూడా థైరాయిడ్ వస్తుంది అంటున్నారు నిపుణులు.  షుగర్ లెవల్స్ థైరాయిడ్‌ను ప్రభావితం చేస్తుంటాయి. దీంతో ఇది హైపోథైరాయిడిజంకు దారి తీసే అవకాశం ఎక్కువ. అంతే కాకుండా మెటబాలిక్ రేటుపై కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు నిపుణులు.

ప్రాసెస్ ఫుడ్స్:
ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవద్దు. వీటిని అధికంగా తినే వారిలో కూడా థైరాయిడ్ అనేది ఎక్కువగా ఎటాక్ చేస్తుంది. ముఖ్యంగా ప్రాసెస్ ఫుడ్స్.. థైరాయిడ్స్‌పై ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.

నిద్ర లేకపోవడం:
సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా థైరాయిడ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.అంతేకాదు నిద్ర సరిగ్గా లేకపోతే థైరాయిడ్ లెవల్స్ నియంత్రణలో ఉండవు. దీని వలన హైపర్ థైరాయిడైజమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.