Telugu News » Entertainment » Do you know how much remuneration nagarjuna is getting for bigg boss show
Nagarjuna : నాగార్జున బిగ్ బాస్ షో కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాగార్జున...ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా ఏర్పాటు చేసుకున్నాడు...
Nagarjuna : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల నుంచి స్టార్ హీరోగా వెలుగొందుతున్న వారిలో నాగార్జున ఒకరు. ఆయన కెరియర్ మొదటి నుంచి కూడా వైవిద్య భరితమైన పాత్రలను చేస్తూ హీరోగా రాణించడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ వచ్చారు. ఆయన కెరియర్ లో ఎన్నో డిఫరెంట్ పాత్రలను కూడా చేశాడు. ముఖ్యంగా భక్తిరస ప్రధానమైన చిత్రాల్లో నటించడమే కాకుండా ఆయన తప్ప అలాంటి సినిమాలను మరెవరు చేయలేరు అనేంతల తనకంటూ ఒక మార్కును కూడా క్రియేట్ చేసుకున్నాడు. అందుకే నాగార్జున ఎలాంటి పాత్రనైనా చేస్తాడు అంటూ ఆయనకు ప్రేక్షకుల్లో ఒక ఆదరణ అయితే దక్కుతుంది. నిన్నే పెళ్ళాడుతా లాంటి సినిమాలో రొమాంటిక్ క్యారెక్టర్ లో కూడా నటించి మెప్పించాడు. నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈయన తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న నలుగురు హీరోల్లో తను కూడా ఒకడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున ఇప్పటికీ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…అక్కినేని నాగార్జున సినిమాలే కాకుండా షో స్ ని కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా బిగ్ బాస్ షో ద్వారా ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 షో నడుస్తుంది. ఇక దీనికోసం నాగార్జున ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
నిజానికి నాగార్జునకి ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది.
ఇక ఆయన ఇమేజ్ ను వాడుకోవడానికి బిగ్ బాస్ షో కూడా భారీ మొత్తంలో అతనికి రెమ్యూనరేషన్ ని చెల్లించి మరి ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ వస్తున్నారు… ఇక ఈ షో మొత్తానికి గాను నాగార్జున దాదాపు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ షో తెలుగు టెలివిజన్ రంగంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతుంది. కాబట్టి భారీ మొత్తంలో నాగార్జునకు డబ్బులు చెల్లించి మరి బిగ్ బాస్ యాజమాన్యం ఆయననే హోస్ట్ గా తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఆయన తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో చాలావరకు ముందు వరుసలో ఉన్నాడు.
అలాగే ఆ షో ని హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. ఇక షోలో ఆయన మాట్లాడే విధానం గాని, కంటేస్టెంట్ ను ట్రీట్ చేసే పద్ధతి గాని అద్భుతంగా ఉంటుంది. కాబట్టే బిగ్ బాస్ యాజమాన్యం ప్రతి సంవత్సరం నాగార్జున గారిని ఆ షో కి హోస్టుగా తీసుకుంటుంది…