Naga Chaitanya – Sobhita wedding : బిగ్ బ్రేకింగ్ : నాగ చైతన్య – శోభిత పెళ్లి తేదీ ఖరారు..ఆంధ్ర ప్రదేశ్ లోని ఆ ప్రాంతంలో జరుగనుందా?

నాగ చైతన్య - శోభిత పెళ్ళికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వీళ్లిద్దరి పెళ్లి డిసెంబర్ నాల్గవ తేదీన గ్రాండ్ గా చేయబోతున్నారట.

Written By: Vicky, Updated On : October 30, 2024 1:14 pm

Naga Chaitanya - Sobhita wedding

Follow us on

Naga Chaitanya – Sobhita wedding : అక్కినేని నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల జంట పెళ్లి పనుల్లో ఫుల్ బిజీ గా ఉంది. రీసెంట్ గానే శోభిత దూళిపాళ్ల వైజాగ్ లోని తన నివాసంలో పెళ్లికి ముందు జరగాల్సిన పనుల్లో పాల్గొని దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన చేయగా, అవి తెగ వైరల్ గా మారింది. అలాగే మొన్న అక్కినేని కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ANR అవార్డ్స్ ఫంక్షన్ లో కూడా ఈ జంట పాల్గొనింది. చూపులు మొత్తం ఈ జంటపైనే, బ్లాక్ డ్రెస్ లో కళ్ళు చెదిరిపోయే అందంతో క్యూట్ గా కనిపించారు. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వీళ్లిద్దరి పెళ్లి డిసెంబర్ నాల్గవ తేదీన గ్రాండ్ గా చేయబోతున్నారట. ఈమధ్య కాలం లో సెలబ్రిటీస్ ఎక్కువగా డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో విదేశాల్లో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

కానీ వీళ్లిద్దరు మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. హైదరాబాద్ లో ప్రస్తుతం 144 సెక్షన్ అమలు లో ఉండడంతో అక్కడ పెళ్లి చేసుకోవడం కుదరదు. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ లోనే చేసుకోబోతున్నారని తెలుస్తుంది. పైగా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు ఊర్లోనే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. శోభిత పుట్టింది ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలి ప్రాంతం. ఆ తర్వాత ఆమె కుటుంబం వైజాగ్ కి షిఫ్ట్ అయ్యింది. కాబట్టి ఈ వివాహం వైజాగ్ లో జరగనుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే సోషల్ మీడియా ద్వారా తెలియచేయనుంది అక్కినేని ఫ్యామిలీ. సమంత తో విడాకులు జరిగిన తర్వాత, నాగ చైతన్య – శోభిత డేటింగ్ లో ఉంటున్నట్టు వార్తలు ప్రచారం అయ్యాయి. మొదట్లో ఇవి కేవలం రూమర్స్ అని అందరూ అనుకున్నారు కానీ, అకస్మాత్తుగా నిశ్చితార్థం చేసుకోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇది ఇలా ఉండగా డిసెంబర్ 4వ తారీఖున జరగబోయే ఈ వివాహమహోత్సవానికి తెలుగు సినీ ఇండస్ట్రీ తో పాటుగా,రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.

ఇలా ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోలేదు. చాలా కాలం తర్వాత మన రాష్ట్రము లో జరుగుతున్న పెళ్లి కావడంతో మీడియా కవరేజ్ కి కూడా అనుమతిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వం లో ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ మీద సుమారుగా 80 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల రెండవ వారం లో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.