Raw vegetable: అన్ని రకాల కూరగాయల్లో పోషకాలు ఉంటాయి. ఏడాది మొత్తంలో చూసుకుంటే సీజన్ బట్టి అన్ని రకాల కూరగాయలను ఏదో ఒక రోజు తింటాం. అయితే వండిన కూరగాయలు కంటే పచ్చివి ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాగే కొందరు సలాడ్‌లా చేసి తింటారు. ఈ సలాడ్ చేసేటప్పుడు కొందరు స్టీమ్ చేసి తింటారు. ఇలా తింటే ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా డైట్ పాటించేవాళ్లు తింటారు. డైలీ తాజా కూరగాయాలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా కూరగాయలు కాపాడుతాయి. చాలామంది కూరలు కంటే అన్నం ఎక్కువ తింటారు. కానీ రైస్ కంటే కూరలు తింటేనే శరీరానికి పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే కొందరు కూరగాయాలను పచ్చిగా తింటారు. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ కొన్ని రకాల కూరగాయలను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ కూరగాయలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బంగాళదుంపలు
బంగాళదుంపలు కూర అంటే చాలామందికి ఇష్టం. ఎక్కువ మంది బంగాళదుంపల వేపుడు కర్రీ తింటారు. అయితే కీళ్ల నొప్పులు ఉన్నవారు దుంపలకు కాస్త దూరంగా ఉంటారు. ఈ బంగాళదుంపలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పచ్చిగా తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళదుంపల్లో సోలనిన్ అనే విషపూరిత సమ్మేళనం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. పచ్చిగా తినడం వల్ల ఇందులోని విషపదార్థం శరీరంలోకి చేరుతుంది. దీనివల్ల కడుపులో నొప్పి, వికారం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పచ్చి దుంపలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు.
బెండకాయలు
బెండకాయల కూర చాలామంది ఇష్టంగా తింటారు. అయితే కొందరు బెండకాయలను పచ్చిగా తింటారు. ఇందులో కూడా సొలనిన్ ఉంటుంది. దీనివల్ల బెండకాయను తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సొరకాయ
పచ్చి సొరకాయను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. పొట్లకాయలోని కొన్ని రకాల సమ్మేళనాలు ఉంటాయి. వీటివల్ల సొరకాయను పచ్చిగా తింటే కడుపులో గ్యాస్, తిమ్మిరి వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. కూరగాయలను పచ్చిగా కాకుండా ఉడికించి తింటేనే ఆరోగ్యంగా ఉండటంతో పాటు తినే ఆహారం కూడా జీర్ణం అవుతుందని చెబుతున్నారు.
బచ్చలికూర
బచ్చలికూర, పచ్చిమిర్చి, ముల్లంగి, బ్రకోలీ, క్యాప్సికమ్ వంటి వాటిని బాగా ఉడికించి మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పచ్చిగా తినడం వల్ల అలెర్జీ సమస్యలు, కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని పచ్చిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చి కూరగాయలను తినవద్దు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.