https://oktelugu.com/

Prashant Neel : ప్రశాంత్ నీల్ కి సినిమా కంటే డబ్బంటేనే ఎక్కువ ఇష్టమా..? కారణం ఏంటి..?

ప్రతి దర్శకుడి లక్ష్యం పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదగడం. అందుకే ఇండియా మొత్తాన్ని కనెక్ట్ చేసే సబ్జెక్టులను సినిమాలుగా రాసుకుంటూ స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. అందువల్లే ఇప్పుడున్న చాలామంది దర్శకులు మంచి సక్సెస్ లను అందుకుంటూ టాప్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 8, 2024 5:36 pm
    Prashanth Neel

    Prashanth Neel

    Follow us on

    Prashant Neel : నిజానికి చాలామంది దర్శకులు ఒక ప్యాషన్ తో సినిమా ఇండస్ట్రీకి వచ్చి దర్శకుడి గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఉద్దేశ్యంతో అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. కానీ ఒక దర్శకుడు మాత్రం తను ప్యాషన్ తో ఇండస్ట్రీకి రాలేదని కేవలం దానికి డబ్బులు అవసరం ఉండి మాత్రమే సినిమాలు చేస్తున్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ దర్శకుడు ఎవరు అంటే కన్నడ సినిమా ఇండస్ట్రీలో చేసిన కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంథ్ నీల్ ఆయన చేసిన ప్రతి సినిమాలో వైలెన్స్ అనేది ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇక ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక అసలు విషయంలోకి వస్తే ఆయన కన్నడలో చేసిన ఉగ్రం సినిమా ఫ్లాప్ అయింది. దానివల్ల ఆయన తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఇక ఎలాగైనా సరే సినిమా అనేది ఒక బిజినెస్ గానే భావించి దాని ద్వారా మనం విపరీతమైన డబ్బులు సంపాదించాలి.

    ప్యాషన్ తో సినిమా చేయడం కంటే డబ్బుల మీద ఆశతో సినిమా చేస్తే సినిమాను మనం ఇంకా చాలా బాగా చేయచ్చు అనే ఉద్దేశ్యం తో ఆయన అప్పటినుంచి డబ్బులు మీదే ఆశపెట్టుకొని కేజిఎఫ్ సినిమాను చేశాడు. అది సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది.

    అప్పటినుంచి భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ కేవలం డబ్బుల కోసం మాత్రమే నేను సినిమా చేస్తాను అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ అయితే ఇచ్చాడు. ఇక ప్రశాంత్ నీల్ సినిమాలో ఎమోషన్స్ గాని, ఎలివేషన్స్ గాని భారీ రేంజ్ లో ఉంటాయి. ప్రతి సీన్ ఇంట్రడక్షన్ లాగే ఉంటుంది. ఒక హీరోకి ఎలివేషన్ ఇవ్వడంలో రాజమౌళి ఎంతటి ఘనుడో అతని తర్వాత ప్రశాంథ్ నీల్ కూడా అంతటి పేరు సంపాదించుకున్న దర్శకుడిగా గుర్తింపును పొందుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాతో మరోసారి రికార్డులు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

    మరి డ్రాగన్ సినిమా 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నంలో ప్రశాంథ్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ప్రశాంత్ నీల్ చెప్పినట్టుగానే ఎన్టీయార్ కూడా తన మేకోవర్లో గాని, తన లుక్కులో గాని క్యారెక్టర్జేషన్ లో గాని చాలా పరిణితి ని సంపాదించుకొని ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది…