డేంజర్: కరోనాతో పురుషుల్లో సెక్స్ సామర్థ్యం ఖతమే?

కరోనా ఎంత పనిచేస్తోంది.. మనుషుల ప్రాణాలు తీయడమే కాదు.. ఇప్పుడు ఆ మహమ్మారి నుంచి బయటపడిన మగాళ్ల పటుత్వాన్ని కూడా దెబ్బతీస్తోందని తేలింది. ఇక ఇతర దీర్గకాలిక సమస్యలకు కరోనా వైరస్ కారణమవుతోందని తేటతెల్లమైంది. కరోనా మనుషులను కబళించడమే కాదు.. ఇప్పుడు కోరుకున్న వారికి ధీర్ఘకాలిక, అంగస్తంభన సహా పలు సమస్యలకు కారణమవుతోందని పరిశోధనలో తేలింది. వ్యాక్సిన్లు వస్తే కానీ దీనికి అడ్డుకట్ట పడే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పుడు మూడో ట్రయల్స్ పూర్తి చేసుకుంటున్న టీకాలు […]

Written By: NARESH, Updated On : October 26, 2023 4:47 pm
Follow us on

కరోనా ఎంత పనిచేస్తోంది.. మనుషుల ప్రాణాలు తీయడమే కాదు.. ఇప్పుడు ఆ మహమ్మారి నుంచి బయటపడిన మగాళ్ల పటుత్వాన్ని కూడా దెబ్బతీస్తోందని తేలింది. ఇక ఇతర దీర్గకాలిక సమస్యలకు కరోనా వైరస్ కారణమవుతోందని తేటతెల్లమైంది.

కరోనా మనుషులను కబళించడమే కాదు.. ఇప్పుడు కోరుకున్న వారికి ధీర్ఘకాలిక, అంగస్తంభన సహా పలు సమస్యలకు కారణమవుతోందని పరిశోధనలో తేలింది. వ్యాక్సిన్లు వస్తే కానీ దీనికి అడ్డుకట్ట పడే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పుడు మూడో ట్రయల్స్ పూర్తి చేసుకుంటున్న టీకాలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఈ ఉపద్రవాలు తొలిగిపోయే అవకాశాలు ఉన్నాయి.

అంటువ్యాధుల నిపుణులైన డాక్టర్ డేనా గ్రేసన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న తర్వాత సంబంధిత వ్యక్తుల్లో రక్తనాళ వ్యవస్థలో సమస్యలకు కారణమవుతుందని ఆయన తెలిపారు. దీని ఫలితంగా పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కరోనా లక్షణలు రోజురోజుకు కొత్త కొత్తవి వెలుగుచూస్తున్నాయి. కరోనా బారిన పడిన వారి శరీరాన్ని ఆ వైరస్ గుల్ల చేస్తుందనే వార్తలు కూడా కలవరపెడుతున్నాయి. తాజాగా కరోనా వచ్చిన పురుషుల్లో అంగస్తంభన సమస్యలను పురుషులను కృంగదీస్తున్నాయి.