గెలిచిన ఆనందం ఆవిరి.. అధికారం కోసం అప్పటి వరకు ఆగాల్సిందే..!

జీహెచ్ఎం ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లలో మాత్రం జోష్ కన్పించడం లేదు. ఈసారి సిట్టింగ్ స్థానాల్లో 54మంది కార్పొరేటర్లు తిరిగి ఎన్నికవగా.. కొత్తగా 96మంది కార్పొరేటర్లుగా గెలిచారు. సిట్టింగుల్లో గెలిచిన వారికి ఎలాంటి సమస్య లేకపోయినా కొత్తగా ఎన్నికైన వారు కార్పొరేటర్లుగా చెలమణి కావాలంటే ఫిబ్రవరి 10వరకు వేచిచూడాల్సిందే..! మొత్తం 150డివిజన్లలో 149స్థానాల ఫలితాలు వెల్లడవగా టీఆర్ఎస్ 55.. బీజేపీ 48.. ఎంఐఎం 44.. కాంగ్రెస్ 2స్థానాలను గెలుచుకున్నాయి. నేరేడ్ […]

Written By: Neelambaram, Updated On : December 7, 2020 10:46 am
Follow us on

జీహెచ్ఎం ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లలో మాత్రం జోష్ కన్పించడం లేదు. ఈసారి సిట్టింగ్ స్థానాల్లో 54మంది కార్పొరేటర్లు తిరిగి ఎన్నికవగా.. కొత్తగా 96మంది కార్పొరేటర్లుగా గెలిచారు. సిట్టింగుల్లో గెలిచిన వారికి ఎలాంటి సమస్య లేకపోయినా కొత్తగా ఎన్నికైన వారు కార్పొరేటర్లుగా చెలమణి కావాలంటే ఫిబ్రవరి 10వరకు వేచిచూడాల్సిందే..!

మొత్తం 150డివిజన్లలో 149స్థానాల ఫలితాలు వెల్లడవగా టీఆర్ఎస్ 55.. బీజేపీ 48.. ఎంఐఎం 44.. కాంగ్రెస్ 2స్థానాలను గెలుచుకున్నాయి. నేరేడ్ మెట్ స్థానం ఫలితం మాత్రం ఇంకా వెల్లడికాలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు ముందస్తు జరిగాయి. దీంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.

నిబంధనల ప్రకారం మూడునెలల ముందు ఎన్నికల నిర్వహించుకునే అధికారం జీహెచ్ఎంసీ పాలకవర్గానికి ఉంటుంది. అయితే ప్రతీసారి కూడా నెలరోజుల ముందుగా ఎన్నికల నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ పాలకవర్గం ముగిసేనాటికి కొత్తగా ఎన్నికయ్యే అధికారంలోకి రానుండటంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాలేదు.

ఈసారి పాలకవర్గం ముగియడానికి మూడునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లంది. దీంతో కొత్తగా ఎన్నికైన వారు కార్పొరేటర్లుగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మరో రెండు నెలలు వేచిచూడాల్సి వస్తోంది. గత పాలకవర్గం సమయం ముగిసే వరకు కూడా వారే కార్పొరేటర్లుగా కొనసాగనున్నారు. ప్రొటోకాల్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్లో పాతవారే పాల్గొంటారని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.

ఇటీవల కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు మరో రెండునెలల వరకు ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో వారంతా నిరుత్సాహం చెందుతున్నారు. ఎన్నికలు అవగానే కొత్తగా గెలిచినవారు ఆయా డివిజన్లలో తామే ప్రథమ పౌరులుగా మారిపోతుండగా ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది.

పాత కార్పొరేటర్లకు మరో రెండు నెలల సమయం ఉండటంతో సిట్టింగ్ కార్పొరేటర్లే ప్రభుత్వ కార్యక్రమాల్లో.. అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. దీంతో కొత్త.. పాత కార్పొరేటర్లను డీల్ చేయడం జీహెచ్ఎంసీ అధికారులకు పెద్ద సవాలుగా మారుతోంది.