గతేడాది డిసెంబర్ నెలలో చైనా దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలైంది. వైరస్ ఆ దేశం నుంచి ఇతరదేశాలకు వేగంగా వ్యాప్తి చెందింది. అయితే శాస్త్రవేత్తలు కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శరవేగంగా పరిశోధనలు చేసి అతి త్వరలో వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే నిపుణులు మాత్రం కరోనా వ్యాక్సిన్ పై అనేక సందేహాలను, అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
కరోనాకు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావడం అంత తేలిక కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రాణాంతక వ్యాధులకు వ్యాక్సిన్ ను కనుగొనటానికి పది సంవత్సరాలు పట్టిందని.. మలేరియా లాంటి వ్యాధులకు ఇప్పటికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని.. అయితే కరోనాకు మాత్రం అందుబాటులోకి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పలు దేశాల అధినేతలు కరోనా వ్యాక్సిన్లు తీసుకోమని చెప్పడానికి కూడా ఇదే కారణమై ఉండవచ్చని తెలుస్తోంది.
సంవత్సరం కాలంలోని కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంపై నిపుణులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ల పనితీరు గురించి ఆయా సంస్థలు చేస్తున్న ప్రకటనలు సైతం అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అయితే మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం గతంతో పోలిస్తే పరిస్థితుల్లో మార్పు వచ్చిందని వేగంగా అనుమతులు లభించడం వల్ల వ్యాక్సిన్ ను త్వరగా అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమైందని అభిప్రాయపడుతున్నారు.