కడుపునొప్పిని సులువుగా తగ్గించుకోవడానికి పాటించాల్సిన చిట్కాలివే..?

మనలో చాలామందిని కడుపునొప్పి సమస్య వేధిస్తూ ఉంటుంది. కడుపు నొప్పి వస్తే ఇతర పనులు చేసుకోవాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి. మందులు వాడటం వల్ల కడుపు నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు కానీ వైద్యులు మాత్రం వంటింటి చిట్కాల వల్లే కడుపు నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చని చెబుతూ ఉంటారు. ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, అపెండసైటిస్, అల్సర్, ఫుడ్ పాయిజన్, పొట్టలో గ్యాస్ ఇతర కారణాల వల్ల కడుపునొప్పి వస్తుంది. కడుపునొప్పి నుంచి తక్షణమే […]

Written By: Navya, Updated On : November 29, 2020 8:00 am
Follow us on

మనలో చాలామందిని కడుపునొప్పి సమస్య వేధిస్తూ ఉంటుంది. కడుపు నొప్పి వస్తే ఇతర పనులు చేసుకోవాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి. మందులు వాడటం వల్ల కడుపు నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు కానీ వైద్యులు మాత్రం వంటింటి చిట్కాల వల్లే కడుపు నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చని చెబుతూ ఉంటారు. ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, అపెండసైటిస్, అల్సర్, ఫుడ్ పాయిజన్, పొట్టలో గ్యాస్ ఇతర కారణాల వల్ల కడుపునొప్పి వస్తుంది.

కడుపునొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలిగించడంలో పుదీనా ఎంతగానో సహాయపడుతుంది. పుదీనా ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే సులభంగా కడుపు నొప్పికి చెక్ పెట్టవచ్చు. కడుపునొప్పికి తక్షణ ఉపశమనం కలిగించడంలో ఆలోవెరా ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక కప్పు అఓలోవెరా జ్యూస్ తీసుకుంటే కడుపునొప్పితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.

గోరు వెచ్చని నీరు, లెమన్ వాటర్ కలిపి తీసుకోవడం వల్ల కడుపునొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తోంది. గ్లాస్ గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా వేసుకుని తాగినా మంచి ఫలితాలు ఉంటాయి. కడుపునొప్పిని తగ్గించడంలో అల్లం సైతం అద్భుతంగా పని చేస్తుంది. సాల్ట్ వాటర్ తాగినా కడుపునొప్పి సమస్య దూరమవుతుంది. హీట్ ప్యాడ్ లను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

యాపిల్ సైడర్ వెనిగర్ కడుపునొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. యాలకుల విత్తనాలను టీలో వేసి మరిగించి తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. అజీర్తి, వికారం, వాంతులను దూరం చేయడంలో యాలకుల టీ సహాయపడుతుంది. వేడినీటిలో కొద్దిగా సోంపు వేసి నిమ్మరసం కలుపుకుని తాగినా మంచి ఫలితాలు ఉంటాయి. తరచూ కడుపునొప్పితో బాధ పడే వాళ్లు కారం ఉండే ఫుడ్స్ కు దూరంగా ఉంటే మంచిది.