మీరు బైక్ లేదా స్కూటర్ ను వాడుతున్నారా..? బయటకు వెళ్లే సమయంలో బైక్ పై లేదా స్కూటర్ పై వెళుతున్నారా..? వాహనంపై వెళ్లే సమయంలో హెల్మెట్లను వినియోగిస్తున్నారా..? అయితే ఇకపై వాహనదారులు హెల్మెట్ ను వినియోగించినా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈ నిర్ణయం వల్ల వాహనదారులు బీ.ఎస్.ఐ మార్కు ఉన్న హెల్మెట్లను మాత్రమే వాడాల్సి ఉంటుంది.
ఐ.ఎస్.ఐ మార్క్ ఉన్న హెల్మెట్లు కాకుండా ఇతర హెల్మెట్లు వాడితే మాత్రం జరిమానా చెల్లించక తప్పదు. కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ నిబంధనలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో వాహనదారులు తప్పనిసరిగా ఐ.ఎస్.ఐ మార్క్ ఉన్న హెల్మెట్లను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. కొంతమంది వాహనాదారులు హెల్మెట్లు వాడుతున్నా ప్రాణాలు కోల్పోతున్నారు. నాసిరకం హెల్మెట్లు వాహనదారుల ప్రాణాలు కోల్పోవడానికి కారణం.
ఇకపై హెల్మెట్లను విక్రయించే వాళ్లు కూడా బీ.ఐ.ఎస్ హాల్ మార్క్ ఉన్న హెల్మెట్లను మాత్రమే విక్రయించాలి. అలాంటి హెల్మెట్లు కాకుండా సాధారణ హెల్మెట్లు వాడితే కూడా కేంద్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వాహనదారులు నిబంధనల గురించి అవగాహన ఏర్పరచుకుని తూచా తప్పకుండా నిబంధనలు పాటిస్తే మాత్రమే జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు.
కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ గతంలోనే ఈ నిబంధనలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2021 మార్చి 1 నుంచి నూతన నిబంధన అమలులోకి రానుంది. ప్రజలు ఈ నిబంధన గురించి అవగాహన ఏర్పరచుకుంటే జరిమానా నుంచి తప్పించుకోవచ్చు.