
సాధారణంగా పెద్దలతో పోల్చి చూస్తే పిల్లలు ఎక్కువ సమయం నిద్రపోవాలి. పిల్లలు తక్కువ సమయం నిద్రపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తగినంత నిద్ర లేని పిల్లల్లో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. పిల్లలైనా, పెద్దలైనా రోజుకు తగినంత సమయం నిద్రపోతే మాత్రమే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు.
Also Read: పిల్లలు బరువు పెరగడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?
చిన్నారులకు తగినంత నిద్ర లేకపోతే మేధా శక్తి ఆశించిన మేరకు పెరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 9 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడిస్తున్నారు. తక్కువగా నిద్రపోతే పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుందని పిల్లల నిద్ర విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడిస్తున్నారు. ఏ కారణం వల్ల పిల్లలు నిద్రపోవాలో తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: వ్యాయామం ఎక్కువగా చేస్తే కలిగే నష్టాలు తెలుసా..?
పిల్లలు తక్కువగా నిద్రపోవడం వల్ల వారి ప్రవర్తనలో కూడా మార్పు ఉండే అవకాశం ఉంటుంది. సరిగ్గా నిద్రపోని పిల్లల్లో చదువు, ఇతర విషయాలను త్వరగా నేర్చుకునే శక్తి తగ్గుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు రాత్రి సమయంలో వీలైనంత త్వరగా భోజనం ఇవ్వాలి. పిల్లలు నిద్రపోవడానికి అనువైన వాతావరణం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ప్రతిరోజూ ఆటలు ఆడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
ఆడుకోవడం వల్ల యాక్టివ్ గా ఉండటంతో పాటు ఇతర కార్యకలాపాల్లో సులభంగా పాల్గొంటారు. పిల్లలకు రాత్రి సమయంలో మొబైల్ ఫోన్లు అస్సలు ఇవ్వకూడదు. మొబైల్ ఫోన్లు ఇస్తే ఆ ఫోన్ల నుంచి వంచే కాంతి పిల్లల నిద్రపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.