https://oktelugu.com/

పక్కా ‘కమర్షియల్’ హిట్ ఇస్తాడంటా !

హీరో గోపీచంద్ కెరీర్ మొదట్లో విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారి మంచి విజయాలు సాధించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈ హీరో పరిస్థితి డైలమాలో ఉంది. చిత్ర పరిశ్రమలో అన్ని ఉన్న కొంచెం అదృష్టం కూడా ఉండాలంటారు. అదే ఈ హీరోకి ఆమడ దూరంగా ఉండిపోతుంది. సీజన్ కి ఒకటి చొప్పున సినిమా రిలీజ్ చేసినా విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇలాంటి హీరోకి మంచి హిట్ సినిమా పడితే చూడాలని […]

Written By:
  • admin
  • , Updated On : January 7, 2021 / 12:54 PM IST
    Follow us on


    హీరో గోపీచంద్ కెరీర్ మొదట్లో విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారి మంచి విజయాలు సాధించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈ హీరో పరిస్థితి డైలమాలో ఉంది. చిత్ర పరిశ్రమలో అన్ని ఉన్న కొంచెం అదృష్టం కూడా ఉండాలంటారు. అదే ఈ హీరోకి ఆమడ దూరంగా ఉండిపోతుంది. సీజన్ కి ఒకటి చొప్పున సినిమా రిలీజ్ చేసినా విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇలాంటి హీరోకి మంచి హిట్ సినిమా పడితే చూడాలని అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు.

    Also Read: స్పీడ్ పెంచేసిన ‘శ్యామ్‌ సింగ్ రాయ్’ !

    తాజాగా అందిన సమాచారం ప్రకారం అందరి ఎదురుచూపులుకి శుభం కార్డు పడే సమయం దగ్గర్లోనే ఉన్నట్లుగానే అనిపిస్తుంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ మారుతి కలయికలో “ప్రతిరోజూ పండుగే” మూవీ వచ్చి సంవత్సరం దాటిపోయింది. మారుతి నెక్స్ట్ మూవీ మీద అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ఆ ఊహాగానాలన్నిటికి తెరదించుతూ కొత్త మూవీ గురించి మారుతి అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రకటన భలే కొత్తగా అనిపించింది.

    Also Read: మెగా ఫ్యామిలీలో సెటిల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ !

    మారుతి తన కొత్త సినిమా గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో మ్యాచో హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో తీస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. వినోదం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు టైటిల్ ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసమే మారుతి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ రిజిస్టర్ చేశారని టాక్ నడుస్తుంది. మారుతి నుండి మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు, ఇక అల్లు అరవింద్ కంపెనీ నుండి వస్తుందంటే చెప్పాల్సిన పనే లేదు. కాబట్టి ఈ సారి గోపీచంద్ కి మంచి విజయం దక్కుతుందని అనుకోవచ్చు

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్