https://oktelugu.com/

Coconut Water: షుగర్‌ ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగొచ్చా.. నిపుణుల సలహా ఇదే..

వేసవి వచ్చేసింది. వేసవి తాపం పోగొట్టుకునేందుకు చాలా మంది కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇవి శరీరానికి చలువ చేయడంతోపాటు శక్తిని ఇస్తాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 10, 2024 / 08:23 AM IST

    Coconut Water

    Follow us on

    Coconut Water: షుగర్‌.. మధుమేహం.. చక్కెర వ్యాధి.. పేరు ఏదైనా వ్యాధి ఒక్కటే. ఇందులో టైప్‌-1, టైప్‌-2 అనే రకాలు ఉన్నాయి. జన్యుపరమైన కారణాలతోపాటు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడితో షుగర్‌ బాధితులు భారీగా పెరుగుతున్నారు. ప్రస్తుతం ఇది సాధారణంగా మారిపోయింది. అయితే షుగర్‌ ఉన్నవారి ఆహారం విషయంలో చాలా నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. షుగర్‌ పెరిగితే దాని ప్రభావం ఇతర ఆర్గాన్లపై పడుతుంది. అందుకే వ్యాధ నిర్ధారణ అయినవారు డైట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

    కొబ్బరి నీళ్లు మంచిదేనా..
    వేసవి వచ్చేసింది. వేసవి తాపం పోగొట్టుకునేందుకు చాలా మంది కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇవి శరీరానికి చలువ చేయడంతోపాటు శక్తిని ఇస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి నీరు అవసరం. అయితే సహజ సిద్ధమైన కొబ్బరి నీళ్లు తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు తాగడం వలన కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి నొప్పి తగ్గుతుంది. గర్భిణులు కొబ్బరి నీళ్లు తాగితే తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఎంతో మంచిది.

    పుష్కలంగా పోషకాలు..
    ఇక కొబ్బరి నీళ్లలో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను ధృడంగా చేస్తాయి. గ్లాసు కొబ్బరినీళ్లలో 9 శాతం ఫైబర్‌ ఉంటుంది. కడుపులో మంటగా అనిపిస్తే గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే ఉపశమనం కలుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. తరచూ కొబ్బరి నీళ్లు తాగటం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం కూడా తక్కువగా ఉంటుంది.

    మధుమేహం వారికి మంచిదేనా..
    ఇన్ని ప్రయోజనాలు ఉన్న కొబ్బరి నీళ్లను మధుమేహం ఉన్నవారు తాగొచ్చ అన్న సందేహం చాలా మందిలో ఉంది. అయితే న్యూట్రిషనిస్టులు కొన్ని సూచనలు చేస్తున్నారు. సాధారణంగా అన్ని వయసులవారు కొబ్బరి నీళ్లు తాగొచ్చు. షుగర్‌ ఉన్నవారు కూడా కొబ్బరి నీరు తాగొచ్చట. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముదిరిన కొబ్బరికాయ లేదా కొబ్బరి పట్టిన కాయలోని నీటిని తాగకూడదట. లేత కొబ్బరి నీళ్లు తాగితే షుగర్‌ ఉన్నవారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పక్వానికి రాని కొబ్బరి నీళ్లు చప్పగా ఉంటాయి. పోషకాల విషయంలో మాత్రం తేడా ఉండదు. అందుకే లేతవి తాగడం వలన షుగర్‌ లెవల్స్‌ పెరగవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.