https://oktelugu.com/

Vakeel Saab: వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో దొరికినప్పుడు ఇండస్ట్రీ హిట్టు కొట్టాలి గాని, ఇలాంటి సినిమాలు ఏంటి అంటు పవన్ అభిమానుల నుంచి కూడా వేణు శ్రీరామ్ మీద చాలా విమర్శలైతే వచ్చాయి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ముగ్గురు అమ్మాయిల కోసం న్యాయ పోరాటం చేస్తూ ఉంటాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 10, 2024 / 08:30 AM IST

    Vakeel Saab

    Follow us on

    Vakeel Saab: హిందీలో అమితాబచ్చన్, తాప్సీ మెయిన్ లీడ్ లో వచ్చిన పింక్ సినిమా ని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా తెలుగులో సక్సెస్ సాధించింది. కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టలేకపోయింది.ఇక ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఇక ఈయన కూడా పవన్ కళ్యాణ్ ను డీల్ చేయడంలో చాలా సందర్భాల్లో తడబడ్డాడనే చెప్పాలి.

    ఇక పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో దొరికినప్పుడు ఇండస్ట్రీ హిట్టు కొట్టాలి గాని, ఇలాంటి సినిమాలు ఏంటి అంటు పవన్ అభిమానుల నుంచి కూడా వేణు శ్రీరామ్ మీద చాలా విమర్శలైతే వచ్చాయి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ముగ్గురు అమ్మాయిల కోసం న్యాయ పోరాటం చేస్తూ ఉంటాడు. ఆ పోరాటం జన్యున్ గా ఉంటుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ క్యారక్టర్ ను లెంత్ పెంచడానికి ఆయనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టడం..

    అందులో శృతిహాసన్ ను హీరోయిన్ గా పెట్టడం ఆయనకు ఫ్యామిలీ ఉండడం అనేది కొంతవరకు నిరాశపరిచిందనే చెప్పాలి. అయితే ఫ్లాష్ బ్యాక్ లో ఆయనకి ఫ్యామిలీ పెట్టకుండా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఆ సినిమా ప్రేక్షకులను భారీ స్థాయి లో ఆకట్టుకునేది. ఇలా సినిమా చేస్తే బాగుండేదని చాలామంది అభిమానులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేశారు.

    కానీ దర్శకుడు మాత్రం ఆ సినిమాలో ఫ్యామిలీ ని ఆడ్ చేసుకుని సినిమాని తెరకెక్కించాడు. ఇక దానివల్లే పింక్ సినిమాలో రిపీట్ అయిన మ్యాజిక్ ఈ సినిమాలో అంత పర్ఫెక్ట్ గా పోట్రే అవ్వలేదనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ బిజీ లో తిరుగుతున్నాడు. ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలా షూట్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…ఇక సెప్టెంబర్ 27 వ తేదీన ఓజీ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు గా చిత్ర యూనిట్ నుంచి అప్డేట్ అయితే వచ్చింది…