Chiranjeevi And Balakrishna: కొన్ని సినిమాలు కొంతమంది చేస్తే బాగుంటాయి.నటి నటుల వల్ల వాటి రిజల్ట్ కూడా మారిపోతుంది. ఇక అప్పట్లో స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు కలిసి సినిమాలు చేస్తే ఆ సినిమాలు చూడటానికి చాలా గొప్పగా ఉండేవి. అలాగే వాళ్ళ యాక్టింగ్ తో ఆ సినిమాలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేవారు. ఇక ఇది ఇలా ఉంటే అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ లతో మల్టీ స్టారర్ సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ప్లాన్ చేశారు.
కానీ అవి ఏవి కూడా పెద్దగా వర్కౌట్ అవలేదు. ఇక ఒకానొక సందర్భంలో కమర్షియల్ సినిమాల కంటే కూడా వీళ్ళిద్దరిని కలిపి పౌరాణిక సినిమా చేద్దామని ప్లాన్ చేశారు. అయినప్పటికీ అది కూడా పెద్దగా వర్క్ ఔట్ అవ్వలేదు. ఇక అసలు విషయంలోకి వెళ్తే కె రాఘవేందర్రావు దర్శకత్వంలో చిరంజీవి శివుడిగా అర్జున్ భక్తుడిగా వచ్చిన సినిమా శ్రీ మంజునాథ…
ఈ సినిమా లో మొదట అర్జున్ వేసిన క్యారెక్టర్ ని బాలయ్య బాబు తో చేయించాలని దర్శకుడు రాఘవేంద్ర రావు అనుకున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం ఆ క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేదనే ఉద్దేశ్యం తో దాని రిజెక్ట్ చేశాడు… ఇక ఫైనల్ గా అర్జున్ తో ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ని చేయించారు. మొత్తానికైతే ఈ సినిమా ఒక డీసెంట్ హిట్ గా మిగిలింది. ఆ క్యారెక్టర్ ని బాలయ్య బాబు కనక చేసినట్లయితే చిరంజీవి బాలయ్య కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను వసూలు చేసేదని అప్పట్లో చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేశారు.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా బాలయ్య చిరంజీవి కాంబినేషన్ లోమల్టీస్టారర్ సినిమా అయితే రాలేదు. ఆ సినిమా వస్తే చూడాలని అటు నందమూరి అభిమానులు, ఇటు మెగాస్టార్ అభిమానులు వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ ఆ సినిమా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకి వచ్చే పొజిషన్ అయితే లేదు. ఇక బాలయ్య బాబు శ్రీ మంజునాథ సినిమాను ఒప్పుకొని ఉంటే సినిమా మరో లెవెల్లో ఉండేదని చాలామంది చెప్తూ ఉంటారు…