Chiya Seeds: ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చియా సీడ్స్ గురించి అందరూ వింటున్నారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అని ఈ సీడ్స్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారు. అయితే వీటిని కొందరు పుడ్డింగ్ కూడా చేసి తింటున్నారు. వీటిని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని పోషకాలు, విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీంతో చాలా మంది వీటిని అధికంగా తీసుకుంటున్నారు. ఏ పదార్థాలు అయిన లిమిట్ లో మాత్రమే తినాలి. అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలా మంది బరువు తగ్గడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఓట్స్ పుడ్డింగ్ లేదా ఉదయాన్నే ఈ వాటర్ తాగుతున్నారు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని డైలీ డైట్ లో చేర్చుకుంటే.. ఫిట్ గా ఉంటారు. కానీ అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. తప్పకుండా మీ ఆరోగ్యం డేంజర్ లో పడుతుంది. మరి వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కలిగే అనార్ధాలు ఏంటో తెలుసుకుందాం.
ఆరోగ్యానికి మేలు చేసే చియా సీడ్స్ ని రోజు తీసుకుంటే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా జీర్ణక్రియ పాడవుతుంది. అలాగే అలెర్జీ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలు ఉన్నవాళ్లు అసలు చియా సీడ్స్ కి దూరంగా ఉంటేనే మంచిది. ఈ చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే నీటిని ఎక్కువగా గ్రహిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే.. బాడీ డిహైడ్రేషన్ కు గురవుతుంది. ఇందులో ఫైబర్ వల్ల కొంతమందికి కడుపు నొప్పి, గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఎక్కువగా బరువు తగ్గడం, వీరేచనాలు వంటివి కూడా కొందరిలో కనిపిస్తాయి. వీటిని అలా డైరెక్ట్ గా తినకూడదు. ఇలా తింటే.. బాడీ జీర్ణం చేసుకోలేదు. దీనివల్ల ఇంకా ప్రమాదం పెరుగుతుంది. వీటిని కనీసం పది నుంచి పదిహేను నిముషాలు అయిన నానబెట్టాలి. అప్పుడే తీసుకుంటే.. ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజుకి 20 గ్రాముల చియా సీడ్స్ మాత్రమే తీసుకోవాలి. రక్తపోటు సమస్య ఉన్నవాళ్లు అసలు వీటిని తీసుకోకూడదు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తం పలుచగా తయారవుతుంది. అలాగే ఏవైనా మందులు వాడుతున్న వాళ్లు వీటికి దూరంగా ఉండాలి. ఇవి ప్రతికూల ప్రభావాలని చూపిస్తుంది. మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ సమాతుల్యతను దెబ్బతిస్తుంది. రొమ్ము, అండాశయ క్యాన్సర్ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండాలి. లేకపోతే ప్రమాదం ఇంకా ఎక్కువ అవుతుంది.