Cristiano Ronaldo: సమకాలీన ఫుట్ బాల్ క్రీడలో క్రిస్టియానో రొనాల్డో సృష్టిస్తున్న సంచలనాలు అంతా ఇంతా కాదు. రెండు దశాబ్దాల పాటు అతడు ఫుట్ బాల్ ను శాసిస్తున్నాడు. తనదైన ఆట తీరుతో పై చేయి కొనసాగిస్తున్నాడు. ఇతర ఆటగాళ్లకు సాధ్యం కానీ ఘనతను సొంతం చేసుకున్నాడు. తాజాగా మరో రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. బహుశా ఈ ఘనత మరే ఆటగాడికి సాధ్యం కాకపోవచ్చు.
రొనాల్డో తన కెరియర్లో 900 వ గోల్ సొంతం చేసుకున్నాడు. ఈ ఘనతను సాధించిన తొలి ఫుట్ బాల్ ఆటగాడిగా రొనాల్డో చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. యూఈ ఏఎఫ్ ఏ నేషన్స్ లీగ్ లో భాగంగా క్రోయేషియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.. మ్యాచ్ ప్రారంభమైన 34 నిమిషంలో బంతిని తన ఆధీనంలో తీసుకున్నాడు క్లోజ్ రేంజ్ షాట్ అత్యంత గట్టిగా కొట్టాడు. పైగా దానిని టాప్ చేశాడు. అత్యంత సునాయాసంగా నెట్ లోకి పంపించాడు. ఆ తర్వాత వేగంగా పరుగు తీసి 900 గోల్ సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని నేలపై పడిపోయాడు. భావోద్వేగానికి గురయ్యాడు.
39 ఏళ్ల వయసులో..
రొనాల్డో వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు. ఇప్పటివరకు 1236 మ్యాచ్ లు ఆడాడు.. 900 గోల్స్ సాధించాడు. సాధారణంగా ఫుట్ బాల్ ఆడే క్రీడాకారులు కుడి పాదంతో గోల్స్ చేస్తారు. ఎందుకంటే కుడి పాదానికి బలం ఎక్కువగా ఉంటుంది. అయితే రొనాల్డో ఎడమ పాదంతోనూ గోల్స్ చేయడం విశేషం. కుడి పాదంతో 576, ఎడమ పాదంతో 173, హెడ్ షాట్ తో 151 గోల్స్ సాధించాడు. పెనాల్టీల ఆధారంగా ఏకంగా 164 గోల్స్ సొంతం చేసుకున్నాడు.. అతడి సుదీర్ఘ కెరియర్లో 30 పెనాల్టీలను గోల్స్ గా మలచలేకపోయాడు.
దూకుడు కొనసాగిస్తున్నాడు
రొనాల్డో 131 ఇంటర్నేషనల్ గోల్స్ చేశాడు. రియల్ మాడ్రిడ్ జట్టు తరఫున 450, మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 145, జువెంటస్ జట్టు తరఫున 101.. ప్రస్తుతం ఆడుతున్న క్లబ్ ఆల్ నాజర్ తరఫున 68 గోల్స్ చేశాడు. రొనాల్డో తర్వాత ఎక్కువ గోల్స్ సాధించిన ఆటగాడిగా అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఉన్నాడు. అతడు ఏకంగా 8 59 గోల్స్ సాధించాడు. రొనాల్డో కు అటాకింగ్ ప్లేయర్ అనే పేరు ఉంది. వయసు పెరుగుతున్నప్పటికీ.. అతడు తన ఆటలో ఏమాత్రం పస తగ్గించడం లేదు. తన కెరియర్ మొదలైనప్పుడు ఎలాంటి ఆట ఆడాడో.. ఇప్పుడు కూడా అదే ఆటను ఆడుతున్నాడు.. పైగా రెండు దశాబ్దాలుగా ఫుట్ బాల్ పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.. ఎటువంటి టోర్నీలైనా.. ఎటువంటి జట్లైనా.. ఏమాత్రం భయపడకుండా దూకుడు కొనసాగిస్తున్నాడు. ఈ కాలపు ఫుట్ బాల్ మాంత్రికుడిగా పేరుపొందాడు. పలుమార్లు గాయాలు అతడిని వేధించినప్పటికీ.. కెరియర్ ముందుకు సాగకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ.. అతడు వాటిని పట్టించుకోలేదు. పైగా ఉత్తుంగ తరంగం లాగా ప్రకాశిస్తున్నాడు.
Cristiano Ronaldo’s 1st, 100th, 200th, 300th, 400th, 500th, 600th, 700th, 800th, & 900th Goals:
(A THREAD) pic.twitter.com/RgbszRAvcR
— Soham. (@ronaldogoatsfc) September 5, 2024