https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: హౌస్ నుంచి ఈ వారం బయటకు వచ్చేది ఎవరంటే?

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ల గేమ్ మొదలు పెట్టేశారు. ఈసారి నామినేషన్స్ లో మణికంఠ, విష్ణుప్రియ, శేఖర్ భాష, సోనియా, బేబక్క, పృథ్వి ఉన్నారు. అయితే వీరిలో మణికంఠ మీద కాస్త నెగటివ్ ఉంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 7, 2024 / 02:09 PM IST

    Bigg Boss 8 Telugu(24)

    Follow us on

    Bigg Boss 8 Telugu: అందరికి ఇష్టమైన బిగ్ బాస్ షో మంచి రసవత్తరంగా సాగుతుంది. పెద్దగా తెలియని కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ కొత్త కొత్త ట్విస్ట్ లతో షో మంచిగా సాగుతుంది. అయితే బిగ్ బాస్ చూసేవాళ్లు ఎక్కువగా నామినేషన్స్, వీకెండ్ కోసమే ఎదురుచూస్తారు. నామినేషన్ లో వాళ్లు కొట్టుకోవడాన్ని చూసి.. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. కేవలం నామినేషన్స్, వీకెండ్ లో నాగార్జున రావడం, ఫన్, ఎలిమినేషన్ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే బిగ్ బాస్ ఈ సీజన్ స్టార్ట్ అయ్యి వారం కావస్తుంది. వీకెండ్ వచ్చేసిదంటే.. ఇక ఓటింగ్ కూడా క్లోజ్ అయిపోయింది. అయితే ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ ఈరోజు వినాయకచవితి పండగ ఉంది. దీనివల్ల ఈ సారి ఎవరిని కూడా ఎలిమినేట్ చేయకపోవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఓట్లు ప్రకారం చూసుకుంటే.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దాం.

    హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ల గేమ్ మొదలు పెట్టేశారు. ఈసారి నామినేషన్స్ లో మణికంఠ, విష్ణుప్రియ, శేఖర్ భాష, సోనియా, బేబక్క, పృథ్వి ఉన్నారు. అయితే వీరిలో మణికంఠ మీద కాస్త నెగటివ్ ఉంది. కానీ నామినేషన్ సమయంలో మణికంఠ సింపితి గేమ్ ప్లే చేశాడు. దీంతో జనాలు మణికంఠకి ఓట్లు గుద్దేశారు. అయితే ఓటింగ్ ప్రకారం మణికంఠ టాప్ ప్లేస్ లో ఉన్నాడని తెలుస్తుంది. కానీ కొన్ని ఓటింగ్స్ ప్రకారం విష్ణుప్రియ టాప్ లో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ బెజవాడ బేబాక్క మాత్రం ఓటింగ్ లో లాస్ట్ ఉంది. పప్పు వల్ల బేబక్కను అందరూ నామినేట్ చేశారు. ఈసారి హౌస్ నుంచి బేబాక్క పక్కా వెళ్లిపోవడం కాయమని అంటున్నారు. డే వన్ నుంచే మణికంఠ పేరు హోస్ లో వైరల్ అవుతుంది. హౌస్ లో అందరూ అతన్ని కార్నర్ చేశారు. దీని వల్ల మణికంఠ టాప్ 2లో ఉన్నాడని అందరూ భావిస్తున్నారు. అయితే మూడో స్థానంలో పృధ్విరాజ్, తరువాత స్థానాల్లో సోనియా ఆకుల, శేఖర్ బాషా, విజయవాడ బేబక్క ఉన్నారు. అయితే శేఖర్ బాషా కూడా ఈ వారం డేంజర్ లో ఉన్నట్లే. ఏది ఏమైనా కూడా ఈసారి బేబక్క ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద బేబక్కకి 9 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. టాప్ వన్ లో ఉన్న మణికంఠకి 28 శాతం, విష్ణు ప్రియకి 26 శాతం, పృథ్వీకి 12 శాతం, సోనియా ఆకులకి 12 శాతం, శేఖర్ బాషాకి 10 శాతం ఓట్లు పడ్డాయి. అయితే వినాయక చవితి పండుగ వల్ల ఎలిమినేషన్ లేకపోవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారో లేదో నామినేషన్ ఉంటుందో లేదో తెలియాలి అంటే కాస్త సమయం ఆగాల్సిందే.