
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ధూమపానం చేసేవాళ్లకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రస్తుతం 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అయితే కేంద్రం వయో పరిమితిని 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచబోతుంది. కేంద్రం ఇప్పటికే వయోపరిమితిని పెంచుతూ కొత్తబిల్లును రూపొందించింది.
Also Read: అల్పాహారంలో వీటిని తింటున్నారా.. ఆ వ్యాధులు వచ్చే ఛాన్స్…?
కేంద్రం రూపొందించిన కొత్త బిల్లు ప్రకారం ఇకపై 21 సంవత్సరాల పై బడిన వారికి మాత్రమే దుకాణాదారులు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయించాల్సి ఉంటుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ కొత్తబిల్లును రూపొందిస్తోంది. 2003 సంవత్సరంలో చివరిసారిగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల నిబంధనల్లో మార్పులు జరిగాయి. కొత్త చట్టం అమలులోకి వస్తే 21 ఏళ్ల లోపు వారికి సిగరెట్ల విక్రయాలకు అనుమతించడం, అమ్మేలా ప్రోత్సహించడం కూడా నేరాలుగా పరిగణిస్తారు.
Also Read: ఖర్జూరం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
సిగరెట్లు, ఇతర పొగాకుల ఉత్పత్తులు 2020 పేరుతో ప్రభుత్వం రూపొందించిన బిల్లు త్వరలో అమలులోకి రానుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ బిల్లును రూపొందించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించే విధంగా కేంద్రం చట్టాలలో కీలక మార్పులు చేయడం గమనార్హం. తొలిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే లక్ష రూపాయల జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించేవారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
తొలిసారి పట్టుబడిన వ్యక్తి మరోసారి నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే మాత్రం 5 లక్షల రూపాయల జరిమానాతో పాటు 5 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. కొత్త చట్టం అమలులోకి వస్తే మాత్రం ధూమపానం చేసేవారికి ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.