https://oktelugu.com/

రామతీర్థ ఘటన: అశోక్ గజపతిరాజుకు షాకిచ్చిన జగన్

రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం కావడం.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, విజయనగరం మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు అక్కడ సందర్శించి రచ్చ చేయడంతో జగన్ సర్కార్ అప్రమత్తమైంది. విజయనగరం జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో ఆ జిల్లాకు చెందిన విజయనగరం రాజవంశీకుడు, మూడు ప్రముఖ దేవస్థానాల ధ్మరకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజుకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనను మూడు ప్రముఖ దేవస్థానాల ధ్మరకర్తగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Also Read: రణరంగమైన రామతీర్థం ప్రస్తుతం వివాదాస్పదమైన […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2021 / 07:12 PM IST
    Follow us on

    రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం కావడం.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, విజయనగరం మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు అక్కడ సందర్శించి రచ్చ చేయడంతో జగన్ సర్కార్ అప్రమత్తమైంది. విజయనగరం జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో ఆ జిల్లాకు చెందిన విజయనగరం రాజవంశీకుడు, మూడు ప్రముఖ దేవస్థానాల ధ్మరకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజుకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనను మూడు ప్రముఖ దేవస్థానాల ధ్మరకర్తగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    Also Read: రణరంగమైన రామతీర్థం

    ప్రస్తుతం వివాదాస్పదమైన రామతీర్థం రామాలయం, విజయనగరం పైడితల్లి, మందపల్లి ఆలయాల ధర్మకర్త హోదా నుంచి అశోక్ గజపతిరాజును తాజాగా ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఆయనకు హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీవో 65ను ఉపసంహరిస్తూ దేవాదాయశాఖ మెమో ఇచ్చింది. తాజా పరిణామంపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

    ఇప్పటికే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అశోక్ గజపతిరాజును ప్రతిష్టాత్మక సింహాచల దేవస్థానం చైర్మన్ పదవి నుంచి జగన్ సర్కార్ తొలగించింది. అలాగే విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించింది.

    Also Read: ఏపీలో మరో ఆరు నెలలు ‘స్పెషల్‌’ పాలన

    ఈ రెండు పదవుల్లో అశోక్ గజపతి అన్న కూతురు సంచయితను ఏపీ సర్కార్ నియమించింది. తాజాగా అశోక్ చేతిలో ఉన్న మరో దేవాలయాల బోర్డుల నుంచి ఆయనను తొలగిస్తూ షాకిచ్చింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్