Period Problem: మహిళలు ఇంట్లో ఉంటారు వారికి ఏం టెన్షన్. హాయిగా తింటారు పడుకుంటారు అనే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఒక ఆడపిల్లగా పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆమెకు చాలా కర్తవ్యాలు ఉంటాయి. అందులోనూ చాలా ఆచారాలు కూడా ఉంటాయి. కొన్నింటిని ఆమె మాత్రమే భరించాలి. అందులో భాగంగానే ఏ మగవారు కూడా అనుభూతి చెందలేని కొన్ని సమస్యలు మహిళలకు మాత్రమే ఉంటాయి. నెలసరి, గర్భం, బాలింత, విదవరాలు వంటివి కేవలం అమ్మాయికి మాత్రమే సొంతం.
ఇక నెలసరి వచ్చినా ఏది జరిగినా ఇంట్లో పనులు చేయకుండా ఉంటే ఆ ఇంట్లో ఏ పని ముందుకు సాగదు. మరి కొందరికి నెలసరి సమయంలో చాలా కడుపు నొప్పి వస్తుంటుంది. ఇలా కడుపు నొప్పి వస్తే పిల్లలు పుట్టరనే ఓ నమ్మకం కూడా ఉంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్. దీనిమీద వైద్యులు ఏమంటున్నారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే నెలసరి సమయంలో కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? ఏ విధమైన నొప్పి అనే విషయాల మీద పిల్లలు పుడతారా? లేదా అనేది ఆధారపడి ఉంటుందట.
నెలసరి మొదలైన దగ్గర నుంచి కడుపు నొప్పి ఉంటే అది కామన్ కడుపునొప్పి అంటున్నారు వైద్యులు. దీని వల్ల కడుపునొప్పి మాత్రలు కూడా వేసుకోవచ్చట. దీని వల్ల పిల్లలు పుట్టరనే సమస్య లేదట. అయితే కొందరిలో 30-35 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు నెలసరిలో కడుపు నొప్పి వస్తే దీనికి కారణాలు వేరుగా ఉంటాయి. ఫైబ్రాయిడ్, ఎడినోమినేషియా, పీసీఓడీ, గర్భసంచి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు మీ కడుపు నొప్పికి కారణం కావచ్చు.
ఇలాంటి సందర్భాలలో మాత్రమే పెగ్రెన్సీసీ విషయంలో కాస్త ఇబ్బంది ఉంటుందట. అందుకే సెకండరీ స్టేజ్ లో డాక్టర్ ను సంప్రదించి వారి సలహాలు సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్ది పిల్లలు పుట్టే అవకాశం మరింత తగ్గుతుంటుంది కాబట్టి జాగ్రత్త మస్ట్ అంటారు నిపుణులు.