Sweat Benefits: చెమట పట్టడం మంచిదేనా? కాదా? ఏమైనా అనర్ధాలు ఉన్నాయా?

చర్మం తనలో ఉండే రక్తంలోని వ్యర్థాలను చెమట రూపంలో బయటకు పంపుతుంటుంది. చెమట ఎక్కువ పట్టేవారికి అందులో లవణాలు, పనికి రానీ వ్యర్థపదార్థాలను, ట్యాక్సిన్స్ ను చర్మంలోనికి పంపిస్తుంది శరీరం.

Written By: Swathi Chilukuri, Updated On : April 10, 2024 3:00 pm

Sweat Benefits

Follow us on

Sweat Benefits: ఎండాకాలం వచ్చినా, ఏదైనా కష్టమైన పని చేసినా వెంటనే చెమట వస్తుంటుంది. కొన్ని సార్లు ఈ చెమట స్మెల్ వల్ల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎండలో పనిచేస్తే ఈ చెమట బారిన పడకతప్పదు. ఇక కష్టమైన పని చేసినా ఈ చెమట ఇబ్బంది పెడుతుంది. ఇంతకీ చెమట పట్టడం మంచిదా? కాదా? చెమట వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎందుకు చెమట పడుతుంది? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చర్మం తనలో ఉండే రక్తంలోని వ్యర్థాలను చెమట రూపంలో బయటకు పంపుతుంటుంది. చెమట ఎక్కువ పట్టేవారికి అందులో లవణాలు, పనికి రానీ వ్యర్థపదార్థాలను, ట్యాక్సిన్స్ ను చర్మంలోనికి పంపిస్తుంది శరీరం. ఈ చర్మం నుంచి చెమట రూపంలో బయటకు వస్తాయి వ్యర్థాలు. ప్రతి రోజు లీటర్ నుంచి 2 లీటర్ల చెమట పడితే ప్రతి రోజు శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతుంటాయి. ఎవరికి అయితే చెమట పట్టకుండా ఉంటుందో వారికి ఈ వ్యర్థాలు, లవణాలు చర్మ రంధ్రాల్లో పేరుకుంటాయి.

చెమట రాకపోతే లోపలనే వ్యర్థాలు పెరిగి, టాక్సిన్స్ పెరిగి, కాలుష్యం ఎక్కువ అవుతుంటుంది. దీనివల్ల అనారోగ్యాలు తలెత్తుతాయి. అందుకే ఎంత చెమట పడితే అంత మంచిది అంటారు వైద్యులు. మన శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపించే అతిపెద్ద అవయవం చర్మం. ఈ చర్మం వల్లనే చాలా రోగాల నుంచి కాపాడుకుంటున్నాం. మరి మీకు కూడా చెమట వస్తుందా లేదా?

చెమట రావడానికి చాలా మంది ఉదయం వర్కౌట్స్ కూడా చేస్తుంటారు. అందుకే మీరు ఏసీలో కూర్చుని పనిచేస్తుంటే రేపటి రోజు మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అందుకే వెంటనే చెమట వచ్చే పనులు కొన్ని అయినా చేయండి. అలవాటు చేసుకోండి. లేదంటే మార్నింగ్ వాక్, జాగింగ్, వ్యాయామం చేయండి.