Ashwagandha : శృంగార సామర్థ్యం పెంచడమే కాదు.. అశ్వగంధతో ఎన్ని ప్రయోజనాలంటే?

అశ్వగంధకు ఒత్తిడిని దూరం చేసే సత్తా ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కీళ్ల వాతంతో బాధపడే వారికి ఇది బాగా పనిచేస్తుంది. లైంగిక పటుత్వానికి ఇది బాగా ఉపకరిస్తుంది. అశ్వగంధతో మన ఆరోగ్యం బాగుపడుతుంది. అశ్వగంధ తీసుకోవడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజరనాలు కలుగుతాయి

Written By: Srinivas, Updated On : June 11, 2023 6:32 pm
Follow us on

Ashwagandha : ఆయర్వేదంలో అశ్వగంధలో ఎన్నో మంచి గుణాలున్నాయి. వేల సంవత్సరాలకు పూర్వమే మనవారు అశ్వంధను వాడుతున్నారు. దీని గురించి అధర్వణ వేదంలో కూడా ఉండటం గమనార్హం. అశ్వగంధను మాయా మూలికగా చెబుతారు. ఒత్తిడి నుంచి దూరం చేసే లక్షణాలు ఇందులో ఉంటాయి. అశ్వగంధ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అశ్వ అంటే గుర్రం, గంధ అంటే వాసన అని అర్థం. అశ్వగంధను తీసుకుంటే మనలో లైంగిక శక్తి పెరుగుతుంది.అశ్వగంధకు ఒత్తిడిని దూరం చేసే సత్తా ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కీళ్ల వాతంతో బాధపడే వారికి ఇది బాగా పనిచేస్తుంది. లైంగిక పటుత్వానికి ఇది బాగా ఉపకరిస్తుంది. అశ్వగంధతో మన ఆరోగ్యం బాగుపడుతుంది. అశ్వగంధ తీసుకోవడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజరనాలు కలుగుతాయి.

అశ్వగంధను తినడం వల్ల చర్మం శుద్ధి అవుతుంది. వీర్యకణాల సంఖ్య పెరిగేందుకు కారణమవుతుంది. శరీరంలో ఉష్ణోగ్రతలను పెంచుతుంది. పిత్తాన్ని పెంచుతుంది. శరీరంలో పాము విషాన్ని తొలగించడంలో ఇది పనిచేస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి వాటికి కూడా అశ్వగంధ బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

నిద్రలేమి సమస్యకు ఇది చెక్ పెడుతుంది. అశ్వగంధను వాడితే చిటికెలో దూరమవుతుంది. ఈ మూలికను ఉపయోగించుకుంటే నిద్ర సమస్యనుంచి బయట పడొచ్చు. అశ్వగంధను తీసుకుని నిద్ర లేమి సమస్య నుంచి బయట పడొచ్చు. అశ్వగంధ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో అశ్వగంధ మనకు చాలా రకాల మేలు చేస్తుంది.