Music Director Anirudh : సౌత్ ఇండియా లోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు అనిరుద్. చూసేందుకు బక్క పలుచగా, చీపురు పుల్లలాగా ఉంటాడు కానీ, ఇతను అందించే మ్యూజిక్ యావత్తు భారదేశాన్ని ఉర్రూతలూ ఊగించేస్తాది. మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరికీ అనిరుద్ కావాలి. ప్రస్తుతం ఆయన చేతిలో తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి 14 సినిమాలు ఉన్నాయి.
ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం కూడా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ‘#OG’ చిత్రానికి సంగీత దర్శకుడిగా ముందుగా అనిరుద్ ని అడిగారట. చాలా రోజులు ఆయనతో సంప్రదింపులు కూడా జరిపాడు డైరెక్టర్ సుజిత్. కానీ ఎంత ప్రయత్నం చేసిన డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో ఈ సినిమా చెయ్యలేను , క్షమించండి అని చెప్పేశాడట.దాంతో #OG మేకర్స్ థమన్ ని తీసుకున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ సినిమాకి నో చెప్పిన అనిరుద్, ఇప్పుడు త్వరలోనే బాలయ్య మరియు బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకి సంగీతం అందించడానికి ఒప్పుకున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది, నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అనిరుద్ సంగీతం అందించిన సినిమాలలో రీసెంట్ గా ఒక్కటి కూడా విడుదల అవ్వలేదు, అన్నీ సెట్స్ మీద ఉన్న సినిమాలే.
అంత బిజీ షెడ్యూల్ లో కూడా బాలయ్య సినిమాకి డేట్స్ ఇచ్చిన అనిరుద్, పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం ఎందుకు డేట్స్ సర్దుబాటు చెయ్యలేకపోయాడు, ‘అజ్ఞాతవాసి’ సినిమా సమయం లో వీళ్లిద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చాయా?, అందుకే అనిరుద్ పవన్ కళ్యాణ్ సినిమాకి డేట్స్ సర్దుబాటు చెయ్యలేదా, ఇలాంటి ప్రశ్నలు మరియు సందేహాలు నిన్నటి నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి.