https://oktelugu.com/

Illegal Relationships : పెళ్లయ్యాక వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు?

అందుకే మనసు వెళ్లిన కాడికి మనసు వెళ్లకూడదు. మనసు వెళ్లిన చోటుకు మనిషి వెళ్లకూడదని చెబుతారు. కానీ ఎవరు పట్టించుకోరు. వెరైటీ కోసం ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారు.

Written By: , Updated On : June 11, 2023 / 06:25 PM IST
Follow us on

Illegal Relationships: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. జీవిత భాగస్వామి ఉండగానే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. దీంతో స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఇతరులతో సంబంధం పెట్టుకుంటున్నారు. దీని వల్ల కలిగే ముప్పును గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలో సంసారాలే నాశనం అవుతున్నాయి. భార్య ఉండగానే మరో స్త్రీతో సంబంధం పెట్టుకోవడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. అసలు ఎందుకు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారో తెలుసుకుందాం.

బలవంతపు పెళ్లిళ్లు

బలవంతపు పెళ్లిళ్ల వల్ల వివాహేతర సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి ఒత్తిడి కారణంగా పెళ్లి చేసుకున్నా తరువాత ఆమెపై కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో పక్కదారి పడతారు. ఇది ప్రేమ వివాహాలు, ఆరేంజ్ డ్ వివాహాలైనా వివాహేతర సంబంధాలు కామనే. జీవిత భాగస్వామితో వేగలేక కూడా ఇతరుల వశం అవుతుంటారు.

గొడవలు

దంపతుల మధ్య సఖ్యత ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఇద్దరి మధ్య గొడవలు ఉంటే ఎవరి దారి వారు చూసుకుంటారు. ఒత్తిడి, ఆందోళన వల్ల ఇద్దరు ఎవరి సుఖం కోసం వారు చూసుకుంటే వివాహేతర సంబంధాలు పుట్టుకొస్తాయి. ఈనేపథ్యంలో దంపతుల మధ్య గొడవలు రాకుండా చూసుకోవడమే మంచిది. అంతేకాని గొడవలు జరిగితే ఇబ్బందులే.

వెరైటీ కోసం..

కొందరికి పొరుగింటిపుల్ల కూర రుచి అన్నట్లు ఇంట్లో భార్య ఉన్నా ఇతరులపై చూపు పడుతుంది. ఇది వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది. దీంతో రెండు కుటుంబాల్లో గొడవలకు కారణమవుతుంది. అందుకే మనసు వెళ్లిన కాడికి మనసు వెళ్లకూడదు. మనసు వెళ్లిన చోటుకు మనిషి వెళ్లకూడదని చెబుతారు. కానీ ఎవరు పట్టించుకోరు. వెరైటీ కోసం ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారు.