Tea Effect: మనలో చాలామందికి ప్రతిరోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. అలసటను తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగులు ఎక్కువగా టీ తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఎక్కువగా టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తయారు చేసిన టీని మళ్లీమళ్లీ వేడి చేసుకుని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీమళ్లీ వేడి చేసిన టీలో పోషకాలు ఉండవు.

మళ్లీమళ్లీ వేడి చేసిన టీ తాగడం వల్ల అల్సర్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. టీ చేసిన చాలా సమయం తర్వాత ఆ టీని వేడి చేసి తాగితే కడుపునొప్పి సమస్యతో పాటు మరికొన్ని సమస్యలు కూడా వస్తాయి. చల్లారిన టీని తాగడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చల్లారిన టీలో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు ఏర్పడతాయి. ఆయుర్వేద టీ తాగేవాళ్లు కూడా టీ వేడిగా ఉన్న సమయంలోనే తాగాలి.
పదేపదే టీని వేడి చేయడం వల్ల టీ రుచి మారిపోవడంతో పాటు టీ చెడు వాసన వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రోజులో ఎక్కువసార్లు టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజులో ఎక్కువసార్లు టీ తాగేవాళ్లను ఇతర దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ప్లాస్టిక్ కవర్లు, కప్పుల్లో కూడా టీ తాగవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్లాస్టిక్ లో ఉండే కెమికల్స్ వల్ల ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. టీని మళ్లీమళ్లీ వేడి చేసుకుని తాగే అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును మార్చుకుంటే మంచిది.