Azadi Ka Amrit Mahotsav: చైనాకు మనకు ‘పచ్చ జెండా’ వేస్తే భగ్గుమంటుంది. ఆ విషయం దేశంలోని చాలా మందికి తెలుసు. చైనా చేస్తున్న కవ్వింపు చర్యలకు ప్రతిగా ప్రధానమంత్రి మోదీ ఆ దేశ వస్తువులను బహిష్కరించారు. దీంతో చాలా చైనా వస్తువులు ఇప్పుడు ఇండియాలోకి రావడం లేదు. కానీ కేంద్రం తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. జాతీయ జెండాలను తయారు చేసుకునేందుకు చైనా నుంచి బల్క్ గా సిల్క్ ను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. చైనా వస్తువులను వాడద్దని చెప్పిన మోదీ మరి ఇలా దిగుమతి చేసుకోవడం దేనికి సంకేతం..? అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
దేశంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్డీయే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. అయితే ఇందులో ప్రజాపయోగాల కన్నా దేశ భక్తిని పెంపొందించేవే ఎక్కువగా ఉన్నాయని కొందరు అంటున్నారు. ప్రధానమంత్రి మోదీ దేశ భక్తుడిగా తాను అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో అందరినీ భాగస్వాములు చేయాలన్నది కేంద్రం ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని మోదీ అన్నారు. అయితే దేశంలో ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలంటే కోట్ల జెండాలు కావాల్సి ఉంటుంది. ఇందుకు ప్రధాని మన శత్రువైన చైనా సహకారం తీసుకోవాలనుకుంటున్నాడు.
చైనాతో కయ్యం ఏర్పడిన తరువాత ప్రధానమంత్రి మోదీ ఆ దేశానికి సంబంధించిన యాప్స్ ను బహిష్కించాలని ఆదేశించారు. అలాగే అక్కడి వస్తువులను కొనుగోలు చేయొద్దని పిలుపునిచ్చాడు. దీంతో అక్కడి నుంచి వచ్చే ముడిసరుకుతో సహా దిగుమతులు ఆగిపోయాయి. అయితే అప్పుడప్పడు చైనాకు చెందిన కొందరు మంత్రులు దేశంలో పర్యటించి వస్తువుల విషయంలో పునరాలోచించాలని కోరారు. కొన్ని నెలల కిందట చైనా మంత్రి ఢిల్లీలో పర్యటించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రధాని హాజరుకాలేదు. దీంతో చైనా విషయంలో మోదీ కఠినంగానే ఉన్నారని భావించారు.
అయితే తాజాగా మోదీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం చేపట్టిన కేంద్రం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. అంతేకాకుండా ఇందులో పలు విషయాల్లో కాంప్రమైజ్ అవుతోంది. దేశ ప్రయోజనాల కోసం చైనాకు తలొగ్గుతోంది. ఆజాదీ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశ భక్తిని చాటుకోవాలని మోదీ కోరారు. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అంటే అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని అంటున్నారు.
దేశంలోని ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జెండా ఎగురవేయాలంటే కోట్ల జెండాలు కావాలి. అందుకు సంబంధించిన ఉత్పత్తి మన దేశంలో సాధ్యం కాదు. దీంతో మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చైనా నుంచి సిల్క్ ను దిగుమతి చేసుకునేందుకు కొందరికి అనుమతి ఇచ్చారు. అంటే ఇప్పుడు జెండా తయారైన తరువాత దానిపై ‘మేడిన్ చైనా’ అని రాసుకోవాలా..? అని ఎద్దేవా చేస్తున్నారు. చైనాకు వ్యతిరేకమని చెబుతున్న మోదీ జాతీయ జెండా విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
Also Read:CM Jagan Review Meeting: ఏపీలో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు.. జరిగే పనేనా?