Homeలైఫ్ స్టైల్Bathe without clothes health facts: శరీరంపై దుస్తులు లేకుండా స్నానం చేయొద్దా.. ఎందుకు..

Bathe without clothes health facts: శరీరంపై దుస్తులు లేకుండా స్నానం చేయొద్దా.. ఎందుకు..

Bathe without clothes health facts: ఉదయం లేవగానే కాలకృత్యాల్లో భాగంగా స్నానం చేయడం అనేది మంచి అలవాటు. ఎందుకంటే స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న మురికి తొలగిపోయి పరిశుభ్రంగా ఉండగలుగుతారు. అంతేకాకుండా స్నానం చేసిన తర్వాత మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా మారుతారు. అందువల్ల సాధ్యమైనంతవరకు ఉదయమే స్నానం చేయడం మంచిది. అయితే ఈ స్నానం చేసే సమయంలో కొన్ని పద్ధతులు పాటించడం చాలా అవసరం అని పెద్దలు చెబుతుంటారు. వీటిలో ముఖ్యంగా దుస్తులు లేకుండా స్నానం చేయడం మంచిది కాదని.. ఇంటిపై కనీసం నూలు పోగైనా ఉంచుకొని స్నానం చేయాలని చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో అవేమీ పాటించడం లేదు. అసలు ఒంటిపై ఎలాంటి అవసరం లేకుండా స్నానం చేస్తే ఏం జరుగుతుంది?

వైద్యపరంగా చూస్తే దుస్తులు లేకుండా స్నానం చేయడం వల్ల ప్రత్యేకంగా హానికరమైన సమస్యలు ఏమి రావు. కానీ పూర్వకాలపు కొందరు పెద్దలు చెప్పిన వివరాల ప్రకారం.. శరీరంపై ఎలాంటి అవసరం లేకుండా స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని అంటుంటారు. అంతేకాకుండా కొన్ని దుష్ట శక్తులు కూడా ఇదే సమయంలో ప్రభావం చూపే అవకాశం ఉందని అంటుంటారు. అందువల్ల శరీరంపై ఏదైనా ఒక వస్త్రం తో స్నానం చేయాలని అంటూ ఉంటారు. కొంతమంది గ్రంథాలు, ఆచారాలు శరీరాన్ని గౌరవంతో కప్పుకోవాలని సూచిస్తాయి. దుస్తులు లేకుండా స్నానం చేస్తే “నెగటివ్ ఎనర్జీ” ప్రభావం ఉంటుందని కొన్ని నమ్మకాలున్నాయి. అయితే ఇవి శాస్త్రీయంగా నిరూపించబడినవి కావు. ఎక్కువగా విశ్వాసాలపైనే ఆధారపడి ఉంటాయి. శరీరాన్ని కప్పుకోవడం పవిత్రతకు సంకేతంగా భావిస్తారు.

అయితే ప్రస్తుత కాలంలో ఎలాంటి వస్త్రం లేకుండా స్నానం చేస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రకారంగా కాకుండా కొన్ని అవసరాల నిమిత్తం కూడా శరీరంపై దుస్తులు ఉండాలని చెబుతున్నారు. పూర్వకాలంలో ఎలాంటి మరుగుదొడ్లు ఉండేవి కావు. చాలామంది ఆరుబయటే స్నానం చేసేవారు. ఈ సందర్భంలో ఒంటిపై వస్త్రంతోనే స్నానం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కలిసే చెరువులు, నదులు ఉపయోగించేవారు. అందువల్ల శరీరాన్ని కప్పుకోవడం అనేది మర్యాదగా భావించేవారు. అంతేకాకుండా అప్పటి సమాజంలో స్త్రీ–పురుషుల మధ్య పరిమితులు కట్టుదిట్టంగా ఉండేవి కాబట్టి దుస్తులతో స్నానం చేయడం ఒక నైతిక నియమంగా మారింది.

కానీ ఇప్పుడు మరుగుదొడ్ల సౌకర్యాలు ఉండడంవల్ల శరీరంపై దుస్తులు ఉంచుకోవడం లేదు. అయితే బయటి ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు లేదా హోటల్లో నివాసం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒంటిపై వస్త్రం ఉంచుకొని స్నానం చేయాలని అంటుంటారు. అంతేకాకుండా శరీరంపై వస్త్రం ఉంచుకొని స్నానం చేయడం వల్ల క్రిమి కీటకాల నుంచి రక్షణ పొందవచ్చు. కొన్ని ప్రదేశాల్లో ఉన్న మరుగుదొడ్లలో అనుకోకుండా ఇవి ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో శరీరంపై వస్త్రం ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది.

దుస్తులు లేకుండా స్నానం చేయడం ఆరోగ్యపరంగా పెద్దగా హానికరం కాదు. కానీ పూర్వకాలంలో అది సంస్కృతి, మర్యాద, సామాజిక పరిస్థితుల వల్ల దుస్తులతో చేయబడింది. ఆధ్యాత్మికంగా కొన్ని నమ్మకాలు ఉన్నప్పటికీ అవి తప్పనిసరి నియమాలు కావు. అందువల్ల వ్యక్తిగత పరిశుభ్రత, ప్రైవసీ, సమాజ పరిమితులు కలిపి మనం ఎలా స్నానం చేయాలో నిర్ణయించుకోవాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular