Paracetamol side effects: జ్వరం రాగానే చాలామంది సొంతంగా నైనా.. వైద్యుల సూచన మేరకు అయినా.. Paracetamol మెడిసిన్ కు ఎక్కువగా ప్రిఫరెన్సీ ఇస్తారు. అయితే చాలామంది జ్వరం రాగానే సొంతంగా మెడికల్ షాప్ లోకి వెళ్లి ఈ మెడిసిన్ ను కొనుగోలు చేసి వాడుతారు. అయితే అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఎంతో సురక్షితమైనది. కానీ మోతాదుకు మించితే మాత్రం ప్రమాదకరమని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. పారాసిటమాల్ అవసరమైన వారు.. ఆరోగ్య దృష్ట్యా తగిన మోతాదులో మాత్రమే వాడాలని.. లేకుంటే కాలేయ సమస్యలు వస్తాయని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అసలు పారాసిటమాల్ ఎవరు? ఎలా వాడాలి?
వైద్యుల సూచన మేరకు.. పెద్దలు పారాసిటమాల్ మెడిసిన్ ను 500 Mg నుంచి 650Mg వరకు వాడాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే వారిని ఆరోగ్య పరీక్ష చేసిన తర్వాతనే ఈ సూచనలు చేస్తారు. కానీ కొందరు సాధారణ సమయాల్లో కూడా జ్వరం లేదా తలనొప్పి వచ్చినప్పుడు 650 mg డోస్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఆ సమయంలో వీరికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఇది ప్రమాదకరంగా మారుతుంది. పిల్లల విషయంలో కూడా 20 కిలోల బరువు ఉన్నవారు అయితే 200 mg నుంచి 300 ఎంజీ వరకు వాడాలని సూచిస్తారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు ఒకసారి పారాసిటమాల్ సిరప్ తీసుకున్న తర్వాత దానిని పదే పదే వాడుతూ ఉంటారు. కానీ ఇలా వాడడం ఎంత మాత్రం సేఫ్ కాదు. పిల్లల శరీరంలో అనేక ఆరోగ్య మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా వైద్యులు తగిన మెడిసిన్ ను అందిస్తారు. ఇలా వైద్యులకు తెలపకుండా సొంతంగా ఇష్టం వచ్చినట్లు సిరప్ లను వాడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.
పారాసిటమాల్ మెడిసిన్ మోతాదుకు మించితే కాలేయ సమస్యలు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా పారాసిటమాలను వైద్యుల సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి. కొందరు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ను వేసుకుంటారు. ఇలా వేసుకోవడం వల్ల లివర్ పై నేరుగా ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఇది ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. అలాగే ఉపవాసం ఉన్న సమయంలో కూడా దీనిని ఎలాంటి ఆహారం తీసుకోకుండా వేసుకోరాదు. ముఖ్యంగా ఎక్కువగా డోస్ తీసుకునేవారు తీవ్రమైన అలసటకు గురయ్యే అవకాశం ఉంటుంది.
పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల జ్వరంతోపాటు తలనొప్పి, బాడీపెయిన్స్ వంటివి వెంటనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే కొందరు వీటిలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వేసుకుంటారు. కానీ ఈ టాబ్లెట్ వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.