Homeహెల్త్‌Chapati Health Benefits: మీరు ఈ చపాతీలను తింటున్నారా..?

Chapati Health Benefits: మీరు ఈ చపాతీలను తింటున్నారా..?

Chapati Health Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ కంటే కూర్చొని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ఆహార పద్ధతులు కూడా మారిపోతున్నాయి. చాలామంది శారీరక శ్రమ తక్కువ అయినందున ఒక పూట అన్నం తింటూ మరో పూట చపాతీలతో గడిపేస్తున్నారు. అయితే కేవలం చపాతీలు మాత్రమే కాకుండా వీటితోపాటు మరిన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అదనపు ప్రోటీన్లు వచ్చే అవకాశం […]

Chapati Health Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ కంటే కూర్చొని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ఆహార పద్ధతులు కూడా మారిపోతున్నాయి. చాలామంది శారీరక శ్రమ తక్కువ అయినందున ఒక పూట అన్నం తింటూ మరో పూట చపాతీలతో గడిపేస్తున్నారు. అయితే కేవలం చపాతీలు మాత్రమే కాకుండా వీటితోపాటు మరిన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అదనపు ప్రోటీన్లు వచ్చే అవకాశం ఉంటుంది. చపాతీలతో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే.. ఎలాంటి ప్రోటీన్లు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం..

చపాతీలు రకరకాలుగా ఉంటాయి. వీటిలో గోధుమ, మక్క, జొన్న, రాగి చపాతీలు ఉంటాయి. అయితే సాధారణంగా చపాతీలు తీసుకునేటప్పుడు ఇందులో కర్రీ ఏర్పాటు చేసుకుంటారు. కర్రీ కి బదులు వీటికి కొన్ని రకాల మిల్లెట్స్ జోడించడం వల్ల అదనపు శక్తి రావడంతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వీటిలో ముందుగా గోధుమ చపాతీల గురించి తెలుసుకుందాం. గోధుమ చపాతీలను తయారు చేసేటప్పుడు వీటిని వేడి చేస్తుంటారు. ఇలా వేడి చేసినప్పుడు ఇందులో ఉండే ఫైబర్ తగ్గిపోతుంది. చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అయితే వీటిని పూడ్చేందుకు చిరుధాన్యాలు తీసుకోవడం మంచిది అని నిపుణులు అంటున్నారు. వీటిలో సోయా, శనగల్ని తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమని అంటున్నారు. మొక్కలతో చేసే చపాతీలను కూడా కొందరు ఇష్టంగా తింటూ ఉంటారు. వీటి ద్వారా శరీరానికి ఐరన్ తో పాటు ఫైబర్ కూడా అందుతుంది. అయితే దీనిని శారీరక శ్రమ ఎక్కువ చేసేవారు ఎంత తిన్నా పర్వాలేదు. కానీ ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటంతో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ చపాతీలను ఎప్పుడో ఒకసారి తీసుకోవడం మంచిది.

ప్రస్తుతం నగరాల్లో ఎక్కువగా జొన్న చపాతీలు కనిపిస్తూ ఉన్నాయి. గోధుమ చపాతీల కంటే జొన్న చపాతీలు తినడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని అంటున్నారు. అలాగే ఇందులో సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. పరువు తగ్గాలని అనుకునేవారు దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఫలితాలను పొందవచ్చు. అలాగే రాగితో చేసిన చపాతీలను తినడం వల్ల కూడా చాలా రకాలుగా ఆరోగ్యం ఉంటుంది. ఇందులో గ్లైసమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు తగ్గాలని అనుకునేవారు.. జైనక్రియ శక్తి పెంపొందించాలని అనుకునేవారు దీనిని తీసుకోవడం మంచిది.

అయితే చాలామంది వీటిని రెడీమెడిగా కొనుగోలు చేస్తారు. ఇలా కాకుండా సాధ్యమైనంతవరకు ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొందరు ఇందులో నాణ్యమైనవి వాడకుండా తక్కువ ధరతో ఉండే వాటిని కొనుగోలు చేసి తయారుచేస్తారు. ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అయితే ప్రముఖ హోటల్లో నాణ్యమైనవి చెక్ చేసుకుని తీసుకోవడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper