Venu Yellamma Movie Updates: ఇండస్ట్రీ లో ఎదురయ్యే కష్టాలను భరించి, కన్నీళ్లను దిగమింగి పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అనే మాట మీద నిలబడిన రాజమౌళి, సుకుమార్, వివి వినాయక్, పూరిజగన్నాథ్ లాంటి దర్శకులు మొదటి సినిమాతోనే వాళ్ల టాలెంట్ ఏంటో చూపించారు. ఇక రాజమౌళి మినహాయిస్తే మిగతా వాళ్లందరూ ద్వితీయ విజ్ఞాన్ని దాటడంలో ఫెయిల్ అయ్యారు… మొదటి సినిమాతో సక్సెస్ కొట్టడం ఈజీ నే కానీ రెండో సినిమా చాలా టఫ్ అంటూ గతంలో వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ మూవీ తో వచ్చిన స్టార్ డమ్ ను వాళ్లు చేసిన సెకండ్ మూవీ రీచ్ అవ్వలేకపోవడం…ఇక 2022 వ సంవత్సరంలో బలగం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు ఎల్దండి…ఈయన సైతం ద్వితీయ విజ్ఞాన్ని దాటుతాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. ప్రస్తుతం ఈయన ‘ఎల్లమ్మ’ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా గత సంవత్సరం నుంచి వార్తల్లో ఉన్నప్పటికి అందులో నటించే హీరో హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పటివరకు క్లారిటీ రావడం లేదు. ఈ సినిమాకోసం కొంతమంది హీరోల పేర్లు వినిపించినప్పటికి అవి అబద్ధపు ప్రచారాలే అంటూ సినిమా యూనిట్ క్లారిటీ ఇస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమాలో కన్నడ నటుడు అయిన విజయ్ ఆంటోని ని భాగం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
నిజానికి విజయ్ ఆంటోని చాలా మంచి నటుడు ఎలాంటి క్యారెక్టర్ ను అయిన సరే పోషించగలిగే కెపాసిటి ఉన్న నటుడు కావడంతో అతనైతేనే ఈ మూవీకి న్యాయం చేస్తాడని వేణు భావిస్తున్నాడట. ఇక వేణు ఇదే విషయాన్ని దిల్ రాజు తో చర్చించి ఇద్దరు కలిసి ఒక డిసిజన్ ను తీసుకున్నారట.
రీసెంట్ గా భద్రకాళి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. నటన పరంగా చూసుకున్న, మార్కెట్ పరంగా చూసుకున్న ఆయన ఈ సబ్జెక్టుకి పర్ఫెక్ట్ సరిపోతాడు అంటూ వీళ్ళిద్దరూ అతన్ని కలిసి కథను కూడా వినిపించారట. మొత్తానికైతే రెండు మూడు రోజుల్లో విజయ్ ఆంటోని ఎల్లమ్మ సినిమాలో హీరోగా ఫిక్స్ అయినట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది… ఎట్టకేలకు ఎల్లమ్మకు మోక్షం దక్కిందనే చెప్పాలి.
ఇక విజయ్ ఆంటోని అయిన ఈ సినిమాలో చివరి వరకు ఉంటాడా? లేదంటే ఆయన కూడా మధ్యలోనే ఈ సినిమా నుంచి తప్పుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. విజయ్ అంటోనీ చేసిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అయి మంచి విజయాలను సాధించిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా బిచ్చగాడు సినిమాతో ఆయన గొప్ప విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో మెప్పిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…