https://oktelugu.com/

Eating Fast: వేగంగా తింటున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు

స్కూల్, కాలేజీ, ఆఫీస్‌ ఇలా ఎక్కడికైనా వెళ్లాలని కొందరు తొందరగా భోజనం చేస్తారు. ఒక ముద్ద నమలకుండానే ఇంకో ముద్ద పెడతారు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తొందరగా తినడం వల్ల అజీర్తి, గ్యాస్, అధిక ఆమ్లత్వం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2024 / 04:00 AM IST

    Eating Fast

    Follow us on

    Eating Fast: కొందరు భోజనం ఆలస్యంగా చేస్తారు. మరికొందరు ఫాస్ట్‌గా తింటారు. ఏదైనా వర్క్ ఉండటం వల్ల ఫాస్ట్‌గా తింటారు. కానీ కొందరికి ఫాస్ట్‌గా తినడమే అలవాటు ఉంటుంది. ఇలాంటి వాళ్లకి అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడో ఒకసారి ఫాస్ట్‌గా తింటే పర్లేదు. కానీ రోజూ కూడా తొందరగా తింటే మాత్రం తప్పకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మన ఇంట్లో వాళ్లు ఆలస్యంగా తింటే.. తొందరగా తినమని చెబుతుంటారు. కానీ భోజన విషయంలో ఆలస్యమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. అసలు ఆలస్యంగా ఎందుకు భోజనం చేయకూడదు? చేస్తే ఏమవుతుంది? ఎలాంటి సమస్యల బారిన పడతారో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    స్కూల్, కాలేజీ, ఆఫీస్‌ ఇలా ఎక్కడికైనా వెళ్లాలని కొందరు తొందరగా భోజనం చేస్తారు. ఒక ముద్ద నమలకుండానే ఇంకో ముద్ద పెడతారు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తొందరగా తినడం వల్ల అజీర్తి, గ్యాస్, అధిక ఆమ్లత్వం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్‌గా తినడం వల్ల ఎంత ఫుడ్ తిన్నారో కూడా సరిగ్గా తెలియదు. దీనివల్ల కొన్నిసార్లు ఎక్కువగా తింటారు. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఫాస్ట్‌గా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్‌గా తిన్నప్పుడు ఒక్కోసారి గొంతులో ఆహారం ఇరుక్కుంటుంది. దీంతో శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొందరగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఫుడ్‌ను నమలకుండా తినడం వల్ల అందులోని పోషకాలు మీ బాడీకి అందవు. దీంతో మీరు ఎంత ఫుడ్ తిన్నా కూడా వ్యర్థమే.

    వేగంగా తినడం వల్ల మానసికంగా ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తారు. వీటితో పాటు నిద్రలేమి, చర్మ సమస్యలు, జుట్టు రాలడం వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యం కొన్నిసార్లు మంచిదే. అలాగే ఫుడ్ విషయంలో కూడా ఆలస్యమే మంచిదని నిపుణులు అంటున్నారు. ఆహారాన్ని నములుతూ ఫుడ్ తినడం వల్ల జీర్ణం అవుతుంది. దీనివల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు కూడా రావు. అలాగే ఆహారంలోని పోషకాలు అన్ని శరీరానికి అందుతాయి. కాబట్టి కాస్త నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి. అలా అని మరీ నెమ్మదిగా తినవద్దు. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో చాలా మంది ఆలస్యంగా కంటే ఫాస్ట్‌గానే ఎక్కువగా తింటున్నారు. వర్క్ ఉందని లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల తొందరగా తినవద్దు. ఎంత బిజీ వర్క్ ఉన్నా కూడా తినడానికి కాస్త సమయమైన కేటాయించండి. అప్పుడే మీరు ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.