New Year 2025: ప్రతి వ్యక్తి కూడా రాబోయే కొత్త సంవత్సరం తమకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును తీసుకోని రావాలని కోరుకుంటారు. అయితే మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తు శాస్త్రం లో కొత్త సంవత్సరం లో డబ్బు, ఆనందం రాక కోసం కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. కొన్ని ప్రత్యేక మొక్కలను కొత్త సంవత్సరం ప్రారంభం లో ఇంటికి తీసుకోని రావడం వలన ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అలా కొత్త మొక్కలను తీసుకోని రావడం వలన ఆ సంవత్సరం మొత్తం సిరి సంపదలతో, ఆనందంతో నిండి ఉంటుంది అని చాలా మంది నమ్మకం కూడా. ఇలా చేయడం వలన ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉన్న కూడా పోయి మొత్తం శుభమే జరుగుతుంది. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం లో ఇంట్లో ఏ మొక్కలను నాటితే అంతా మంచే జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి మొక్క : హిందూ మతం లో తులసి మొక్క కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మొక్కను హిందూ మతం లో చాలా పవిత్రమైన మొక్క గా భావిస్తారు. ఇలాంటి పవిత్రమైన ఈ మొక్కను కొత్త సంవత్సరం ప్రారంభం లో ఇంట్లో నటినట్లయితే ఇంట్లో చాలా శుభప్రదం అని నిపుణులు చెప్తున్నారు. తులసి మొక్కను ఇంట్లో నాటడం వలన లక్ష్మి దేవి అనుగ్రహం కలిగి ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలు వెదజల్లుతాయి.
జమ్మి మొక్క: వాస్తు శాస్త్రం లో జమ్మి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉండి. కొత్త సంవత్సరం ప్రారంభం లో ఈ మొక్కను ఇంట్లో నాటడం వలన అంతా శుభప్రదం జరుగుతుంది అని వాస్తు శాస్త్రం చెప్తుంది. హిందూ మతం ప్రకారం జమ్మి మొక్క ను ఇంట్లో నాటడం వలన శివుడు, శని దేవుని అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. శని దోషం ఏదైనా ఉంటే తొలగిపోతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం లో ఈ మొక్కను ఇంట్లో నాటడం వలన ఆనందం,శ్రేయస్సు కలుగుతుంది.
మనీ ప్లాంట్: ఈ మొక్కకు వాస్తు శాస్త్రం లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను ఇంట్లో నాటడం వలన ఆనందం,శ్రేయస్సు కలుగుతుందని భావిస్తారు. అయితే ఈ మొక్కను ఇంటి ఆగ్నేయ ములలో పెంచుకోవాలి. ఇంట్లో ఈ మొక్క ఉంచినట్లయితే ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. జిల్లేడు మొక్క: వాస్తు శాస్త్రం లో జిల్లేడు మొక్కను పెంచుకోవడం కూడా చాలా శుభప్రదం గా పరిగణిస్తారు. జిల్లేడు మొక్క గణపతికి సంబంధించినది గా చెప్తుంటారు.ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ని తొలగించటం లో ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఆనందం,సంపదలు పెరుగుతాయి.
క్రాసుల మొక్క : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ మొక్కను పెంచుకుంటే సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తొలగించి ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అని చాలా మంది నమ్మకం.