PCOS Problems: ప్రస్తుతం చాలా మంది మహిళలు పీసీఓఎస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీన్నే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ సమస్య వస్తే మహిళలు సరిగ్గా పీరియడ్స్ కారు. రెండు లేదా మూడు నెలలకు ఒకసారి పీరియడ్స్ అవుతుంటారు. అలాగే మహిళలు ఒక్కసారిగా బరువు పెరిగిపోతారు. అయితే ఈ సమస్య హార్మోన్ల వల్ల వస్తుంది. ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది మహిళలు ఈ పీసీఓఎస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య వస్తే బరువు పెరగడం, నెలసరి కాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలు అన్ని కూడా కనిపిస్తాయి. ఎవరైనా మహిళలకు నెలసరి సరిగ్గా రాకుండా రెండు లేదా మూడు నెలలకు వస్తే మాత్రం పీసీఓఎస్‌కి సంకేతం కావచ్చు. కాబట్టి ఇలాంటి సమస్య ఎదురైతే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ పీసీఓఎస్ సమస్య వస్తే ఆండ్రోజెన్ హార్మోన్ పెద్ద పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా ముఖం, శరీరంపై ఎక్కువగా జుట్టు పెరుగుతుంది. అలాగే ముఖంపై మొటిమలు అధికంగా రావడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు అన్ని కూడా కనిపిస్తాయి. అలాగే పిల్లలు పుట్టే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ గర్భం దాల్చిన కొన్నిసార్లు పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో అయితే అసలు ఆలస్యం చేయవద్దు. ఏం కాదులే అని లైట్ తీసుకోకుండా చికిత్స తీసుకోవాలి. బరువు ఎక్కువగా ఉంటే ఫస్ట్ వెయిట్ లాస్ కావాలి. దీంతో సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. కొందరు ఎక్కువగా బయట ఫుడ్ తింటారు. ప్రాసెస్డ్ చేసిన ఫుడ్ తినడం వల్ల పీసీఓఎస్ సమస్య ఎక్కువగా పెరుగుతుంది. వీటిని తినడం పూర్తిగా మానేయాలి. అలాగే వ్యాయామం చేయకపోవడం, నిద్రలేమి, రసాయనాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి.
పీసీఓఎస్ సమస్య నుంచి విముక్తి చెందడానికి ప్రతీ ఒక్కరూ కూడా ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలి. అలాగే పండ్లు, ప్రొటీన్లు ఉండే పదార్థాలు తీసుకోవాలి. శరీరానికి శారీరక వ్యాయామం ఉండాలి. రోజుకి ఒక 15 నిమిషాలు అయిన ఏదో ఒక వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ధ్యానం చేయాలి. బరువు పెరిగే పదార్థాలు అసలు తీసుకోకూడదు. పోషకాలు ఉండే ఫుడ్ తినడం మాత్రమే అలవాటు చేసుకుంటే ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఎక్కువగా యువతలోనే కనిపిస్తుంది. అంటే 20 నుంచి 30 ఏళ్ల మహిళ్లలోనే కనిపిస్తుంది. ఈ వయస్సులోనే పెళ్లి, పిల్లలు అన్ని కూడా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు. ఈ సమస్య ఉన్నవారిలో కొందరు నల్లగా అయిపోతారు. అలాగే వంధత్వం సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యకు చికిత్స మందులు తీసుకోవడం, ఆహార అలవాట్లు మార్చుతుండాలి. ఇలా చేస్తే చాలు సమస్య తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.