
కరోనా వైరస్ బారిన పడిన వాళ్లలో ఎక్కువమంది వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో ఆవిరి పడుతున్నారు. అయితే ఆవిరి పట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. ప్రతి ఒక్కరి ముక్కులో వైరస్ ను అడ్డుకునే రోమాలు ఉంటాయని ఎక్కువగా ఆవిరి పట్టడం వల్ల ఆ రోమాలు దెబ్బ తిని ముక్కులోకి వైరస్ లు, ఫంగస్ లు వెళ్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
మన శరీరంలో ఫంగస్ ఎప్పుడూ ఉంటుందని అయితే ఇమ్యూనిటీ పవర్ తగ్గిన సమయంలో వైరస్ శరీరంపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు మాస్క్ పెట్టుకోకుండా తిరగడం వల్ల ఫంగస్ శరీరంలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. కొంతమంది కరోనా బాధితుల శరీరంలో మృత వైరస్ ఉంటుందని అందువల్ల మళ్లీ పాజిటివ్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా వచ్చి తగ్గిన తరువాత మూడు నెలల సమయాన్ని పోస్ట్ కోవిడ్ గా పరిగణిస్తామని ఈ సమయంలోనే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అయితే పిల్లలకు వైరస్ ప్రాణాంతకం అయ్యే అవకాశాలు తక్కువని వైద్య నిపుణులు పేర్కొన్నారు. పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పరిస్థితులు మెరుగుపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా బాధితుల్లో చాలామంది రక్తం గడ్డ కట్టకుండా ఉండటం కోసం కొన్నిరోజులు మందులు వాడతారని డాక్టర్ల సూచనల ప్రకారం మందులు వాడాలని సూచిస్తున్నారు.