
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 2000 మార్కెటింగ్ సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
http://www.masmcs.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. జూన్ 15వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. పదో తరగతి పాసైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి 10,000 రూపాయల వేతనంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి. హైదరాబాద్ లోని బర్కత్ పురాలో ఉన్న కంపెనీ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఏదైనా సందేహం ఉంటే వెబ్ సైట్ ద్వారా సులభంగా నివృత్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.
కరోనా వల్ల ఉద్యోగాలను కోల్పోయిన వారికి సైతం ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయొజనం చేకూరనుంది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.